Home / Latest Alajadi / కొత్తరకం గ్యాస్ సిలిండర్లు అస్సలు పేలవు.

కొత్తరకం గ్యాస్ సిలిండర్లు అస్సలు పేలవు.

Author:

మనదేశంలో ఒకప్పుడు వంటలు మొత్తం కట్టెలతో చేసేవారు ఆతరువాత కిరోసిన్ స్టవ్ లు వచ్చిన కొంత వరకే ప్రభావం చూపగలిగాయి కానీ వంట గ్యాస్ ఎప్పుడైతే మన వంటింటిలోకి రావడం మొదలైందో అప్పటినుండి మహిళల స్థితిగతుల్లో చెప్పలేనంత మార్పు వచ్చింది.  వారి ఆరోగ్యాల్లో.. టైం ఆదా కావడంలో వంట గ్యాస్ సిలిండర్ చాలా తోడ్పడింది, ప్రస్తుతం ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఖచ్చితంగా ఉంది, కానీ కొన్నిసార్లు గ్యాస్ సిలిండర్ వల్ల జరిగే ప్రమాదాల వల్ల చాలా మంది ప్రాణాల్ని కోల్పోతున్నారు, గ్యాస్ స్టవ్ ని ఆఫ్ చేయడం మరిచిపోవటం వల్ల సిలిండర్ పెళ్లి చాలా పెద్ద పెద్ద అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి , గ్యాస్ సిలిండర్ పేలితే ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది, గ్యాస్ సిలిండర్ వల్ల జరిగే ప్రమాదాలకు చెక్ పెట్టె విధంగా కొత్త ఆలోచనకి ఒక కంపెనీ శ్రీకారం చుట్టింది.

Plastic gas Cylinder

బెంగ‌ళూరు కేంద్రంగా ప‌నిచేసే ఇండో గ్యాస్ సంస్థ ప్లాస్టిక్ గ్యాస్ సిలిండ‌ర్ల‌ను తయారుచేసింది. పేలుడు స్వ‌భావం లేని ప్లాస్టిక్‌తో ఈ సిలిండ‌ర్ల‌ను త‌యారు చేయ‌డం విశేషం. సిలిండర్‌లో మొదట హైడెన్సిటీ పాలిమర్‌ ఎథీన్‌తో ఒక లేయ‌ర్‌ చేసి దానిపై గ్లాస్‌ ఫైబర్‌ వైండింగ్‌ ద్వారా మరో కవచంతో తయారైన సిలిండర్‌కు మరికొన్ని రసాయనాలు కలిపి వేర్వేరు టెంప‌రేచ‌ర్స్‌ వద్ద దశలవారీగా వేడి చేసి దృఢంగా రూపొందించారు.ఈ సిలిండ‌ర్లు 5,10, 12, 15కిలోల ప‌రిమాణంతో త‌యార‌వుతున్నాయి. ప్ర‌స్తుతం ప‌రీక్ష ద‌శ‌లో ఉన్న ఈ సిలిండ‌ర్లు అన్ని టెస్టులకు క్లియ‌రెన్స్ ల‌భించిన త‌ర్వాత మార్కెట్లోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. వీటి సామ‌ర్థ్యం ప‌రిశీలించాల్సిందిగా అన్ని ప్ర‌భుత్వ ఎల్పీజీ సంస్థ‌ల‌కు వీటి శాంపుల్స్‌ను అంద‌జేసింది ఇండో గ్యాస్ సంస్థ‌. ప్ర‌స్తుతం ఈ త‌ర‌హా సిలిండ‌ర్ల‌ను అమెరికా, సౌత్‌కొరియా, గల్ఫ్ దేశాలలో ఇప్పటికే పెద్ద మొత్తంలో వినియోగిస్తున్నారు, మాములుగా గ్యాస్ సిలిండర్ ఇనుముతో చేసింది కావటం వల్ల బయట ఉన్న వేడిని త్వరగా స్వీకరిస్తుంది , ఈ ప్లాస్టిక్ సిలిండర్ లు అయితే బయట వేడిని అస్సలు స్వీకరించవు అందువల్ల గ్యాస్ సిలిండర్ పేలటం అనేది జరిగే ఆవకాశం లేదు.కాబట్టి ప్రభుత్వం త్వరగా వీటిని పరీక్షించి మార్కెట్ లోకి తీసుకరావాలని కోరుకుందాం.

(Visited 13,533 times, 1 visits today)