Home / Political / అమెరికాలో మృతి చెందిన తెలుగు వ్యక్తి… ఈ కుటుంబానికి చేతనైన సాయం చేయండి.

అమెరికాలో మృతి చెందిన తెలుగు వ్యక్తి… ఈ కుటుంబానికి చేతనైన సాయం చేయండి.

Author:

అనుకోకుండా పెద్ద దిక్కుని కోల్పోతే ఒక కుటుంబం అనుభవించే మనోవేదన వర్ణించలేనిది. ఇన్నాళ్ళు అన్ని మధ్య తరగతి కుటుంబాలలానే సంతోషంగా ఉన్నా ఆ కుటుంబం ఒక ఊహించని పరిణామంతో శోక సముద్రంలో మునిగింది. ఉద్యోగరిత్యా అమెరికాలో ఉంటున్న ఒంగోలుకి చెందిన నవీన్ కుమార్ సోమల ఆకస్మికంగా మరణించడంతో అతని కుటుంబంలో విషాద చాయలు చోటుచేసుకున్నాయి. చనిపోయిన నవీన్ కుమార్ భార్య ప్రస్తుతం 30 వారాల గర్భవతి, ఆమే ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. కాలిఫోర్నియా లో నివసించే నవీన్ గత శనివారం కాసేపు వ్యాయామం చేసి, స్విమ్మింగ్ కి వెల్తున్నానని భార్యకి చెప్పి వెళ్ళాడు. స్విమ్మింగ్ పూల్ లో ఎం జరిగిందో తెలియదు కాని అపస్మారక స్తితిలో పూల్ లో పడి ఉన్న నవీన్ ని అక్కడి సిబ్బంది దగ్గరిలోని హోగ్ ఆసుపత్రి కి తరలించారు. బ్రెయిన్ కి ఆక్సిజెన్ అందని కారణంగా అతన్ని క్రిటికల్ కేర్ యూనిట్లో ఉంచారు. వారం రోజులు తరువాత నిన్న సాయంత్రం అక్కడి డాక్టర్లు నవీన్ మృతి చెందినట్లుగా ప్రకటించారు. దానితో గర్భవతి అయిన అతని భార్యను ఓదార్చడం ఎవరి తరం కాలేదని అతని స్నేహితులు తెలిపారు.

please help naveen kumar

అమెరికాలో తెలుగు వారికి ఎటువంటి కష్టం వచ్చిన ఆదుకునేందుకు ముందు ఉండే నవీన్ కే ఇలాంటి కష్టం రావడంతో వారి కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలో అర్దం కావట్లేదని నవీన్ స్నేహితులు వాపోయారు. ఇండియా లో ఉండే నవీన్ తల్లితండ్రులు మరియు అతని అత్తగారి కుటుంబం అతని సంపాదన మీదే బ్రతుకుతున్నారు. ఉన్నట్లుండి నవీన్ మరణించడంతో అతని మీద అధారపడిన అతని భార్య, తల్లితండ్రులు ఇప్పుడు పెద్ద దిక్కును కోల్పోయారు. దానితో అమెరికాలోని నవీన్ స్నేహితులు అతని కుటుంబానికి ఆర్ధిక సాయం చేయడానికి క్రౌడ్ ఫండింగ్ వెబ్ సైట్ లో ఒక ప్రకటణను పెట్టారు. దీని ద్వార వచ్చిన డబ్బులను నవీన్ ఆసుపత్రి బిల్లులు, నవీన్ దేహాన్ని భారతదేశానికి తరలించే ఖర్చులు, మిగిలిన మొత్తాన్ని వారి కుటుంబ సంరక్షణకు ఖర్చు చేస్తామని అందులో తెలిపారు. ఒక కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం ఎన్ని కష్టాలు పడుతుందో మనందరికి తెలుసు అందుకే దయచేసి ఈ కుటుంబానికి మీకు తోచినంతా సహాయం చేయండి. సహాయం చేయడానికి ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి.  https://www.gofundme.com/Help-Naveen-Somala-Family

(Visited 1,915 times, 1 visits today)