Home / Inspiring Stories / ఇకనుండి అనవసరంగా హారన్ కొడితే కేసు.

ఇకనుండి అనవసరంగా హారన్ కొడితే కేసు.

Author:

హైదరాబాద్ లోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికి తెలుసు, ఏ పని మీద బయటకి వెళ్ళాలన్న అసలు సమయానికన్న రెండు గంటల ముందు బయలుదేరితే కాని అనుకున్న సమయానికి గమ్యం చేరలేని పరిస్తితి. విసుగెత్తించే ట్రాఫిక్ కి తోడు వెనుక, ముందు ఉండే వాహానాల హారన్ల మోత చిరాకు తెప్పిస్తుంటుంది. ముందర రెడ్ సిగ్నల్ ఉన్నా కొంత మంది వాహానదారులు అదే పనిగా హారన్ కొట్టి ఇబ్బంది కలిగిస్తుంటారు. ఇకనుండి అలా అవసరం లేకున్నా అడ్డగోళుగా హారన్లు కొట్టేవారిపై కేసులు పెట్టి లోపలేస్తామంటున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు.

honking horn is banned

రోజు రోజుకు పెరిగిపోతున్న ధ్వని కాలుష్యానికి అడ్డుకట్ట వేయడానికి నడుం బిగించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు, హారన్ల పై నిషేదం విధించడంతో పాటు, ఇబ్బందికరంగా ధ్వనులు చేసే సైలెన్సర్లను నిషేధించాలని ప్రతిపాదనలు రూపొందించారు. దేశం లో పెరిగిపోతున్న శబ్ధకాలుష్యాన్ని అడ్డుకోవడానికి సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది వాటికి అనుగుణంగా ఏదైన వాహనదారుడు అనవసరంగా హారన్స్ మోగిస్తే, అతనిపై కేసులు నమోదు చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు ఉంటుంది. అందుకే త్వరలోనే డ్రంకెన్ & డ్రైవ్ లాగే హారన్ కొట్టే వారిపై స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించి కేసులు నమోదు చేయడానికి రెడీ అవుతున్నారు అధికారులు అందుకే వాహనం నడిపేటప్పుడు అవసరం లేకపోతే హారన్ కొట్టకండి.

(Visited 312 times, 1 visits today)