Home / Inspiring Stories / Video: పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కోసం లంచం అడుగుతూ లైవ్ గా వీడియో లో దొరికిపోయిన పోలీస్.

Video: పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కోసం లంచం అడుగుతూ లైవ్ గా వీడియో లో దొరికిపోయిన పోలీస్.

Author:

దేశం అభివృద్ది వైపు అడుగులేస్తున్నా ప్రజలతో క్రియాశీలకంగా ఉండే అధికారులు మాత్రం తమ అవినీతిని ఆపడం లేదు. అవినీతిని అరికట్టడానికి ప్రభుత్వం సాంకేతికతను వాడుతున్నా కాని లంచగొండి అధికారులు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు, అందుకు ఒక ఉదాహరణే లంచం అడుగుతూ లైవ్ గా వీడియో లో దొరికిపోయిన పోలీస్ ఉదంతం. ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా జారీ చేసే పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చి అభ్యర్ది దగ్గర నుండి 4000 రూపాయలు అడుగుతూ కెమెరాకు చిక్కాడు ఉత్తరప్రదేశ్ కి పోలీసు అధికారి.

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో నివసించే అజయ్ సింగ్ పాస్ పోర్ట్ గడువు ముగిసింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన అజయ్ కంపనీ పని బయటి దేశాలను వెళ్ళాల్సి వస్తుందని తన పాస్ పోర్ట్ రెన్యువల్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు చేసిన కొన్ని రోజుల తరువాత పాస్ పోర్ట్ అడ్రెస్ వెరిఫికేషన్ లో భాగంగా వచ్చి తనను పోలీస్ స్టేషన్ లో కలువాలని ఒక అధికారి అజయ్ కి ఫోన్ చేసాడు. దాని తో బిత్తర పోయిన అజయ్, అడ్రెస్ వెరిఫికేషన్ కోసం పోలీసు తన ఇంటికి రావాలి గాని తను పోలీస్ స్టేషన్ కి రావడం ఎంటని ఎదురు ప్రశ్నించడంతో చివరికి పోలీసు అధికారే అజయ్ ఇంటికి వచ్చాడు. లంచం అడుగుతాడని ముందే ఫిక్స్ అయిన అజయ్ తన ఫోన్ లో వీడియో రికార్డు చేస్తూ దాన్ని టేబుల్ మీద పెట్టాడు. వచ్చిన అధికారి అన్ని పత్రాలు పరిశీలించి అజయ్ సంతకం తీసుకొని ఎటువంటి మొహమాటం లేకుండా 4000 రూపాయలు లంచం అడిగాడు దానికి అజయ్ నిరాకరించడంతో చివరికి 2000 ఇవ్వమన్నాడు. డబ్బులు ఇస్తే తనకు 2000 రూపాయలు ముట్టినట్లు రసీదు ఇస్తారా? అని అజయ్ ఎదురు తిరగడంతో ఇక చేసేదేం లేకా ఆ అధికారి బయలుదేరాడు. ఈ విషయాన్ని అదే రోజు కేంద్ర మంత్రి కి ట్విట్టర్లో తెలిపినా అమే స్పందించలేదు. నా కుటుంబ రక్షణ కొరకు నేను ఆ అధికారి మీద ఫిర్యాదు చేయలేదు కాని మన దేశంలో అవినీతి ఏ స్తాయిలో ఉందో ఈ వీడియో చూస్తే తెలుస్తుందని చెప్పాడు అజయ్. మీరు కూడా తమ విధులు నిర్వర్తించడానికి లంచం అడిగే అధికారులను నిలదీయండి.

(Visited 256 times, 1 visits today)