Home / General / బర్త్ డే కి బంగారు గొలుసులు గిఫ్ట్ గా ఇవ్వలంటూ సీఐ,ఎస్సైలకి జిల్లా ఎస్పీ ఆదేశం..!

బర్త్ డే కి బంగారు గొలుసులు గిఫ్ట్ గా ఇవ్వలంటూ సీఐ,ఎస్సైలకి జిల్లా ఎస్పీ ఆదేశం..!

Author:

రేపు సార్‌ పుట్టిన రోజు. స్పెషల్‌ గిఫ్ట్‌తో రావాలి. సార్‌ను ఆనందంలో ముంచేలా ఉండాలి. ఇందుకు బాగా ప్లాన్‌ చేసుకొని ఖరీౖదైన గిఫ్ట్‌ తీసుకురండి..’’ ఇది ఓ జిల్లాలో పనిచేస్తున్న సీఐ, ఎస్సైలకు ఎస్పీ కార్యాలయం నుంచి అందిన వాట్సాప్‌ సందేశం, ఈ సందేశాన్ని చూసిన ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఎస్పీ పుట్టినరోజుకి తమని ఖరీదైన గిఫ్ట్ ఇవ్వలంటూ అడగటం ఏంటి..? అని అనుకున్నారు.

పోలీస్

ఎస్పీ కార్యాలయం నుండి వచ్చిన మెసేజ్ గురుంచి ఎస్పీ సన్నిహితుడిని సీఐ, ఎస్సైలు సంప్రదించారు, ఆ సన్నిహితుడు వారితో “సార్‌ సాదాసీదా గిఫ్ట్‌లు ఇష్టపడరు. ప్రతీ ఒక్క ఎస్సై/సీఐ కనీసం రెండు తులాల బంగారు గొలుసు గిఫ్ట్‌గా తీసుకురావాలి. లేకపోతే సార్‌ ఫీలవుతారు. ఆయన ఇబ్బంది పడితే మీరు కూడా ఇబ్బందిపడాల్సి ఉంటుంది..’’అని సలహాతో కూడిన వార్నింగ్ ఇచ్చాడు, “బంగారు గొలుసు ఇవ్వలేకపోతే రూ.50 వేలు పైన విలువ చేసే గిఫ్ట్ అయినా ఇవ్వాల్సిందే” అని సదరు సన్నిహితుడు తెలపడంతో సదరు ఎస్పీ గురుంచి తెలిసిన అధికారులు గిఫ్ట్ ఇవ్వకపోతే చార్జిమెమోలు, పీపీఐ(పోస్ట్‌పోన్‌ ఆఫ్‌ ఇంక్రిమెంట్‌), సెన్సూర్‌.. ఇలా ఏదో ఒక పనిష్మెంట్‌ ఇస్తాడన్న భయంతో అధికారులందరూ బంగారాన్ని బర్త్‌ డే కానుకగా అందించినట్టు తెలిసింది.

వరంగల్, కరీంనగర్‌ రేంజ్‌లో ఉన్న ఓ జిల్లా ఎస్పీ తన బర్త్‌డే వేడుకలకు ఇలా కానుకలు డిమాండ్‌ చేయడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. బర్త్‌డే వేడుకకు కానుకలు ఇవ్వకపోతే ఇబ్బంది పెడతారన్న భయంతో ఒక్కొక్కరు రెండు తులాల బంగారం కానుకగా ఇచ్చారని ఫిర్యాదులు అందాయి, ఈ విషయంపై ఉన్నతాధికారులు ఆ ఎస్పీ పేరు బహిర్గతం కాకుండా ఆరా తీస్తున్నారు.

పోలీస్

కింది స్థాయి పోలీస్ అధికారులని పై స్థాయి అధికారులు వేధించడం వల్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి తూట్లు పొడిచినట్లే, పై అధికారులకి కానుకలు ఇవ్వడానికి కిందిస్థాయి పోలీస్ అధికారులు డబ్బుల కోసం వివిధ వర్గాల వారిని, వ్యాపారులని బెదిరించే అవకాశం ఉంది, కొన్ని నెలల కిందటి వరకు పోలీస్ స్టేషన్ లు అంటే అవినీతికి కేంద్రాలు అనే పేరుండేది,ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది, ఇలాంటి ఎస్పీల వల్ల మళ్ళీ పోలీసులు అంటే అవినీతే అని ప్రజలు భావించే ఆవకాశం ఉంది, ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఇలాంటి వారిపై మరిన్ని చర్యలు తీసుకోవాలి.

Source: Sakshi.com

(Visited 1,112 times, 1 visits today)