Home / Inspiring Stories / 2000 కిలోల ఆలుగడ్డలు మార్కెట్ లో అమ్మితే ఆ రైతుకు మిగిలింది ఒక్క రూపాయే…!

2000 కిలోల ఆలుగడ్డలు మార్కెట్ లో అమ్మితే ఆ రైతుకు మిగిలింది ఒక్క రూపాయే…!

Author:

రైతు లేనిదే రాజు లేడు ఇది ఒకప్పటి నానుడి కాని ఇప్పుడు అందరూ ఉంటున్నరు కాని రైతే కనుమరుగవుతున్నాడు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, దళారీల దోపీడితో రైతు ఎంత సతమతమవుతున్నాడో కండ్లకు కట్టినట్లు తెలిపే ఉదంతాలు మధ్యప్రదేశ్ లో జరిగాయి. మధ్యప్రదేశ్ కి చెందిన రాజ్ కుమార్ రైతు ఎండనక, వాననక రేయింబవళ్ళు కష్టించి ఆలుగడ్డలు పండించాడు. తనకు పండిన 108 బస్తాల ఆలుగడ్డలను దగ్గరలోని మార్కెట్ కి తరలించి అమ్మాడు. తన ఆలుగడ్డలు అమ్మిన తరువాత వచ్చిన డబ్బులు ట్రాన్స్ పోర్ట్, హమాళీలకు కూడా సరిపోక తనే ఇంకో 773 రూపాయలు మార్కెట్ వారికి కట్టాల్సి రావడంతో ఎమి చేయాలో తోచక బిత్తరపోయాడు రాజ్ కూమార్.

potato former got 1 rupee for 2000 kgs potato

ఇక చేసేదేమి లేక మరోసారి పంటను ఇండోర్ మార్కెట్ కి తరలించాడు ఈ సారి కూడా క్రితం లాగే జరిగింది, 2000 కేజీల ఆలుగడ్డకు 1175 రూపాయలు రాగా అందులో 1174 రూపాయలు రవాణా చార్జీలు, ఇతర మార్కెట్ రుసుముల క్రింద వెళ్ళిపోగా రాజ్ కూమార్ కి 1 రూపాయి చెల్లించారు మార్కెట్ వారు. మార్కెట్ లో కేజీ ఆలుగడ్డను 20 రూపాయలకు అమ్మే వ్యక్తులు రైతుకు మాత్రం కేజీకి రూపాయి కూడా చెల్లించడంలేదు. ఈ రెండు సంధర్బాలలో రాజ్ కూమార్ తన ఆలుగడ్డలను కేజీ ని 37 పైసలకు రెండోసారి 58 పైసలకు అమ్మాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఒక రైతు నాయకుడు రాజ్ కూమార్ రశీదులను ఫోటో తీసి నరెంద్ర మోడీకి ట్విట్టర్ లో పంపడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. రైతు దుక్కి దున్ని, ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పంట పండిస్తే కనీస మద్దతు ధర లేకపోతే ఇక రైతన్న వాడు బ్రతికేదెలా?

(Visited 586 times, 1 visits today)