Home / Entertainment / ప్రభాస్ కన్నా నేనే బెస్ట్ – రాణా

ప్రభాస్ కన్నా నేనే బెస్ట్ – రాణా

Author:

అమరేంద్ర బాహుబలి, భళ్ళాల దేవ  భారత దేశం మొత్తం మార్మోగుతున్న  పేర్లు.

ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక విజువల్ అద్బుతంగా రూపొందిన సినిమా.తెలుగు సినిమా అంటేనే బాలీవుడ్ చిన్న చూపు చూసే స్తాయి నుంచి. హాలీవుడ్ స్థాయిలో తెలుగు సినిమా ని నిలబెట్టిన రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఈసినిమాకి వెన్నెముక లైన హేరో,విలన్ ల పాత్రలకు ప్రాణం పోసిన ప్రభాస్,రాణాలకు భారతీయ ప్రేక్షకులిప్పుడు బ్రహ్మ రథం పడుతున్నారు. ఈ అద్బుతం లో ఒక భాగమైన భళ్ళాల దేవుడు రాణా తో ఒక ఇంటర్వ్యూ..

ప్ర: బాహుబలి ఇండియన్ బిగ్గెస్ట్ సినిమా అని ఇప్పటికే కరణ్ జోహార్ అన్నారుకదా..! బాహుబలి అంతకన్నా పెద్ద హిట్ ఔతుందని మీరనుకుంటున్నారా..? రాణా:ఔను..! అందులో ఏ మాత్రం సందేహం లేదు.బాహుబలి-2 ఖచ్చితంగా బాహుబలి కి ధీటు గా వస్తోంది. ఇది తప్పకుండా పెద్ద హిట్ గా నిలుస్తుందనే అనుకుంటున్నా.

ప్ర:బాహుబలి నిర్మాణ విలువల పరంగా దేశవ్యాప్తంగా మొదటిస్తానం లో నిలిచింది. రాబోయే భాగంలో మరికొన్ని ఉత్కంట భరితమైన సన్ని వేశాలు ఉంటాయని ఆశించవచ్చా..? రాణా:ఖచ్చితంగా. ఇది కేవలం సినిమా కాదు ఒక విజువల్ అద్బుతం. పార్ట్_1 కంటే అద్బుతమైన సన్నివేశాలూ,సెట్టింగులూ చూస్తూ ఆశ్చర్య పొయేందుకు కూడా టైం ఉండదు(నవ్వుతూ)

ప్ర: పార్ట్ వన్ లో ప్రభాస్ జలపాతం పైనుచి దూకే సన్ని వేశాలూ, మీతో బుల్ ఫైట్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి.. మరి బాహుబలి-2 లో ఎలా ఉండబోతొంది? అవే స్థాయిపోరాటాలు ఇంకా ఉన్నాయా..?

రాణా: చాల..(చేతులు దూరంగా చేసి) రోమాలు నిక్కబొడుచుకోవటం అంటారుకదా ఖచ్చితంగా అది ఫీఅవుతారు. అంతే కాదు 1 లో కొద్దిగా తగ్గింది అనిపించిన డ్రామా కూడా2 లో ఉంటుంది. అవన్నీ మాటల్లో చెప్పలేము.. చెప్పాను కదా ఆశ్చర్య పోవటానికి సిద్దంగా ఉండండి  (నవ్వుతూ)..

ప్ర: కేవలం హిందీ వెర్షన్ ఒక్కటే 100 కోట్ల మార్కు దాటింది,మిగిలిన అన్నిభాషలనూ కలుపుకొని 500 కోట్ల భారీ రికార్డు కు దగ్గరలో ఉంది. మరి బాహుబలి-2 ఈ రికార్డుని బీట్చెయ్యగలదంటారా..?

రాణా:వసూళ్ళ పరంగా తెలుగులో ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది.బాహుబలి ఇప్పుడు ఒక భ్రాండ్. ఈతరభాషల్లో కూడా వసూళ్ళు  ఇంకా పెరుగుతాయనే ఆశిస్తున్నాం.

ప్ర:ఇప్పటివరకూ జాతీయ స్తాయి పట్టణాలలో హిందీ సినిమాల హవా నే ఉండేది. ఇప్పుడు దక్షిణాది సినిమాలు నార్థ్ ఇండియాలోకి వెళ్ళటానికి బాహుబలి కొత్త దారివేస్తాడంటార?

రాణా: నన్నో విషయం చెప్పనివ్వండి. సౌతిండియన్ సినిమాలే అయిన రాంగోపాల్ వర్మ శివ, మణిరత్నం “రోజా” ఉత్తర భారతం లో విజయాలని ఎప్పుడో నమొదుచేసాయ్.రికార్డులు బద్దలు కొట్టాయ్.ఆ టైం కి ప్రేక్షకుడికి టచ్ అయ్యే విశయం ఉంటే ఆ సినిమా హిట్ అయి తీరుతుంది అది సౌత్ కావొచ్చు నార్త్ కావొచ్చు. ఇప్పుడు బాహుబలికూడా అదే బాటలో ఉంది.

ప్ర:బాహుబలి కొత్తగా సినిమాలు తీసే వారికి ఇంకా విజయవంతమైన సినిమాలు తీయటం లో ఉపయోగ పడుతుందనుకుంటున్నారా? ఇదే పద్దతి కొనసాగితే భారీ బడ్జెట్సినిమాల దెబ్బకి చిన్న సినిమాలకు ప్రమాదమేమీ లేదంటారా..?

రాణా: లేదు నేనలా అనుకోవటం లేదు. ఎందుకంటే ప్రతి సినిమాకీ దాని సొంత మార్క్ ఉంటుంది. పెద్ద స్టార్ సినిమా,లేదా మంచి ఇతివృత్తం ఉన్న సినిమా ఇలా దేని మార్క్ర్ట్దానిదే. అన్నీ సమానంగానే నడుస్తూంటాయ్. బాహుబలి ఒక యుద్ద కథ. వేరే సినిమాలైన భజరంగీ భాయి జాన్ హిందీ లో,శ్రీమంతుడు తెలుగులో,భారీ హాలీ వుడ్ సినిమ ఐనం-16 లు విడుదలయ్యాయి సక్సెస్ అయ్యయి కూడా. ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూడాలి అనుకుంటాడు పెద్ద సినిమానా,చిన్న సినిమా నా అనేది ఇక్క డ ప్రశ్న కాదు.

ప్ర:మూడు సంవత్సరలు ఒక సినిమా కోసం పని చేసారు కదా ఇతర ఆఫర్లను ఎలా మానేజ్ చేసారు..?

రాణా:(భుజాలెగరేసి) కనీసం ఐదారు ఆఫర్లను బాహుబలి కోసం వదులుకోవాల్సి వచ్చింది. కానీ నేను బాహుబలి తోనే ఉండాలనుకున్నాను. ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్టుసాధారణంగా వచ్చేది కాదు. ఇది ఒక జీవిత కాలపు అనుభవం. శారీరకంగా మానసికంగా కష్టపడ్డాం ఎంతో స్ట్రాంగ్ అయ్యాం కూడా. కేవలం యుద్ద సన్నివేశాల కోసమే 120రోజులు కష్టపడ్డాం. ఇవన్నీ కూడా ఆనందంగా చేసాం ఎందుకంటే… చెప్పాను కద..! ఇలాంటి అవకాశాలు రోజూ రావు.

ప్ర:ఇదివరకు హిందీ సినిమాలని వేరే భాషల్లో రీమేక్ చేసే వాళ్ళు,అలాగే వేరేభాషలనుంచి హిందీలో కూడా రీమేక్ చేసారు.కానీ బహుబలి లా ఇన్ని రకాల భాషల్లో విడుదల చేస్తేఇలా రీమేక్ చేసే సినిమాల పై ప్రభావం పడదంటారా..?

రాణా:అలా ఉండదు. ఎందుకంటే కొన్ని సినిమాలు ఆ ప్రాంతపు స్టార్ ల వల్ల నడిచే సినిమాలు వాళ్ళ సొంత భాష,సొంత ప్రాంతం లోనే వర్క్ ఔట్ అవుతాయి. వేరే భాషల్లో అవిఆకట్టుకోవు. ఉదాహరణ కి ఒక  సూపర్ హిట్ బెంగాలీ సినిమాని అదే వాతావరణం,అదే నేటివిటీ తో తీసామనుకోండి అది ఇక్కడ ఖచ్చితంగా ఫ్లాప్ ఔతుంది. అదే తెలుగువాతావరణం మన స్టార్ ఉంటే.. హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. సో..! అలాంటి మూవీస్ ని రీమేక్ చేయాల్సిందే. కానీ బాహుబలి లాంటి సినిమాని రీమేక్ చేయటంఇంపాజిబుల్,దానికన్నా అన్ని భాషల్లో ఒకే సారి చేయటమే ఈజీ. ఎస్పెషల్లీ దానికైన బడ్జెట్ ని బట్టి చూస్తే..

ప్ర: ఈ సినిమా కోసం మీరు 20కేజీ ల బరువు పెరిగారు..మళ్ళీ వెంటనే తగ్గించారు ఇది మీ ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపించింది..?

రాణా:ఈ సినిమాకోసం 20 కిలోలు పెరిగాను తర్వాత 28 కిలోలు తగ్గాను కూడా, ఇప్పుదు నా బరువు 95 కిలోలు. కానీ అప్పటికే మేం దాదాపు 50% షూటింగ్ పూర్తిచేసేసాం. ఇప్పుడు నేను “బెంగుళూరు బాయ్స్” (తమిళ భాషలో ఉండే మళయాళీ సినిమా) చేస్తున్నా. దానిలో నాది చాలా సాఫ్ట్ క్యారెక్టర్. దానికోసం బరువు తగ్గాల్సి వచ్చింది.నా న్యూట్రిషనిస్ట్,నా డైటీషియన్ ఇవన్నీ చూసుకుంటున్నారు.  ఇప్పుడు బాహుబలి మిగతా భాగం కోసం మళ్ళీ బరువు పెరగాలి.

ప్ర:బాహిబలి-1 లో మీకు హీరోయిన్ లేదు ఇప్పుడు పర్ట్-2 లో కూడా అంతేనా? మీరు “రూలర్” ఐనప్పుడు మీకో “మహారాణి” ఉండాలి కదా..! అది కావాలని చేసిందా లేకస్టోరీలో పెట్టటం మర్చిపోయారా..? మీ పాత్రకి కొంచం గ్లామర్ తగ్గించినట్టు మీకనిపించలేదా…?

రాణా:హ..!(కొద్ది సేపు నవ్వుతూనే ఉన్నారు) ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రోల్ కి గ్లామర్ ఏం తగ్గించలేదు. విలన్ అనేవాడు ఒక స్పెషల్ అప్పియరెన్స్ తో ఉంటాడు సో గ్లామర్ తగ్గటంఅనే ప్రశ్నే లేదు. ఉదాహరణ కి మన పురాణాల్లో ధుర్యోధనుని పాత్ర లేదా మరే విలన్ పాత్రనైనా తీస్కోండి.అసలక్కడ హీరోయిన్ కి పెద్దగా అవకాశమే లేదు. కేవలంఎన్.టీ.ఆఆర్. ఒక్కరే హీరోయిన్ లతో ఎక్స్ పరిమెంట్ చేసారు.

ప్ర: ఏ భాగం లో మీరు బాగా చేసాననుకుంటున్నారు? పార్ట్ 1 లోనా లేక రెండో భాగం లోనా?

రాణా:నిజానికి రెండు పార్ట్ లూ ఒకేసారి షూట్ జరిగింది. పర్ట్-2 లో నేనుకొద్దిగా నెర్వస్ అయ్యాననిపించింది. ఆ రషెస్ చూడాలనుందని రాజమౌళి గారిని అడిగాను. నేనుఆసీన్లు చేసి దాదాపు మూడేళ్ళు ఔతోంది. మళ్ళీ పాత్రలో లీనం కావాలి అంటే వాటిని మళ్ళీ చూసుకోవాలి నేను. నన్ను నేను పాత్రలోకి మార్చుకోవటం నా ముందున్న ప్రశ్నఇపుడు.ఎక్కువ రోజుజులేం లేదు ఇంకో రెండు నెలలు అంతే..

ప్ర:ఒక వేళ రాజమౌళి గారు ఏ పాత్రని ఎంచుకోవాలి అన్న చాయిస్ మీకే వదిలేసుంటే మీరు దేన్ని ఎన్నుకునే వారు బాహుబలి నా..? లేక భల్లాల దేవున్నేనా??

రాణా: నేనెప్పుడూ భళ్ళాల దేవ నే ఇష్ట పడ్డాను నెగెటివ్ క్యారెక్టర్లో ప్రేక్షకులని మెప్పించే చాన్స్ ఎక్కువగా రాదు…

ప్ర:సినిమా చరిత్రలోనే  లొ ఎవరికి (మూవీ స్టార్స్) సినిమాల్లో గానీ, బయట గానీ 100 అడుగుల విగ్రహం చేయించుకునే అవకాశం రాలెదు. కానీ మీ విగ్రం తయారయింది. ఆవిగ్రహాన్ని ఙ్ఞాపకంగా దాచుకునే ఆలోచనేమైనా ఉందా?

రాణా: అది 130 అడుగుల విగ్రహం 25 టన్నుల బరువు, దాని థీస్కురాలెం, కాని అది సబు ()చేసిన అద్బుతం

(Visited 162 times, 1 visits today)