Home / Entertainment / Video: బాహుబలిలో ప్రభాస్ కి ఎక్కువగా నచ్చిన సీన్ ఇదేనట..!

Video: బాహుబలిలో ప్రభాస్ కి ఎక్కువగా నచ్చిన సీన్ ఇదేనట..!

Author:

బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ యే మారిపోయిన సంగతి మనకి తెలిసిందే, టాలీవుడ్ స్టార్ హీరో స్థాయి నుండి ఇండియన్ హీరో స్థాయికి వెళ్ళిపోయాడు, ఒక్క సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ ల్లో అభిమానులని ప్రభాస్ సంపాదించుకున్నాడు, తనని ఈ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలి సినిమాలో తనకు ఇష్టమైన సీన్ గురుంచి ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు, బాహుబలి చిత్ర బృందం కొన్ని సన్నివేశాల బ్యాక్ గ్రౌండ్ ఒరిజినల్ స్కోర్ ని విడుదల చేశారు.

వాటిలో బాహుబలి ది బిగినింగ్ లో శివుడు(బాహుబలి) భద్రుడి(భల్లాలదేవుడి కుమారుడు) ‌తల నరికే సన్నివేశానికి సంబంధించిన నేపథ్య సంగీతం వీడియోను ప్రభాస్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘బాహుబలి: ది బిగినింగ్‌’లో నాకు అత్యంత ఇష్టమైన సన్నివేశం ఇది. కీరవాణి నేపథ్య సంగీతం దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది’ అని పేర్కొన్నారు.

శివుడు మాహిష్మతి రాజ్యంలోకి ప్రవేశించాడన్న విషయాన్ని దేవసేన పసిగట్టినప్పుడు వచ్చే నేపథ్య సంగీతం వీడియోను చిత్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘బాహుబలి’ సిరీస్‌లో తనకు ఇష్టమైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇదని చెప్పారు.

(Visited 147 times, 1 visits today)