Home / Entertainment / ప్రభాస్ రాజకీయం చేస్తున్నాడా?

ప్రభాస్ రాజకీయం చేస్తున్నాడా?

Author:
మన బాహుబలి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే రాయకీయాల్లోకి రానున్నాడా ? బాహుబలి పవర్ స్టార్ పవన్  కళ్యాణ్ ని రీప్లేస్ చేయనున్నాడా? ప్రభాస్ డిల్లీ పర్యటన చూస్తే బీజేపికి దగ్గరవుతున్న సూచనలు కనబడుతున్నాయని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు బాహుబలి సూపర్ హిట్ తో ప్రభాస్ కూడా పవన్ లాగే రాజకీయ అరంగేట్రం చేయనున్నాడని ప్రభాస్ దగ్గరి వాళ్ళ అంచనా.
డిల్లీ వెళ్లి ప్రధాని మోడీని, రాజ్ నాథ్ ని  కలవడం కేవలం బాహుబలి ప్రమోషన్ లో భాగమా ? లేక ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్న పెదనాన్న కృష్ణం రాజు బాటలో ప్రభాస్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నాడా అని ఫిలిం నగర్ లో ఇప్పటికే డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరో వైపు ఇదంతా ఒత్తి గాసిప్ కృష్ణం రాజు గవర్నర్ పదవి కోసం చేస్తున్న రాజకీయ ఎత్తుగడ అని కొంతమంది భావన. ఏది ఏమైనా ప్రభాస్ బహుభాలి హిట్, ప్రధాని మీటింగులతో బాలివుడ్ కూడా షాక్ కు గురైందని, వారి అంచనా ప్రకారం ప్రభాస్ స్ట్రెయిట్ హిందీ ఫిలిం కోసం చేస్తున్న పబ్లిసిటీ అని బాలివుడ్ టాక్.
అసలు ఇదేం కాదు రాజమౌళి అండ్ టీం ప్రభాస్ కి తగిన పబ్లిసిటీ ఇవ్వకపోవడంతో తనే స్వయంగా ఇలా పబ్లిసిటీ చేసుకుంటున్నాడని మరో టాక్ ఆఫ్ టాలివుడ్.
(Visited 31 times, 1 visits today)