Home / Political / ప్రణబ్ భార్య కన్నుమూత

ప్రణబ్ భార్య కన్నుమూత

Author:

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ  ఈ రోజు ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా శ్వాసకోస సంబంధిత వ్యాధితో  బాధపడుతున్నారు. ఆమె శుక్రవారం సాయంత్రం నుండి ఢిల్లీలో ఆర్మీ ఆస్పత్రి (రీసెర్చ్ మరియు రెఫరల్) చికిత్స పొందుతున్నారు. నాటి నుంచి ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10.51 గంటలకు తుదిశ్వాస విడిచారు. సువ్రా ముఖర్జీ పూర్వీకులు బంగ్లాదేశ్‌లోని నర్హాలీ జిల్లాకు చెందినవారు. ప్రణబ్ కలకత్తా యూనివర్శిటీ నుంచి చరిత్ర, రాజనీతిశాస్త్రంలో ఎంఏతో పాటు. న్యాయశాస్త్రంలో కూడా పట్టా పొందారు. కొద్దిరోజుల పాటు న్యాయవాదిగా, ఉపాధ్యాయుడిగా, జర్నలిస్టుగా పనిచేసిన  ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1957లో సువ్రా ముఖర్జీతో వివాహం జరిగింది. ముఖర్జీ దంపతులకు ఇద్దరు కుమారులు.. ఇంద్రజిత్‌, అభిజిత్‌, కూతురు శర్మిష్ట ఉన్నారు. ఆమె మంచి గాయని అని ‘గీతాంజలి ట్రూప్’ను కూడా నెలకొల్పారని పేర్కొన్నారు. సువ్రా ముఖర్జీ గ్రాడ్యుయేట్ ఈమెకు గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే చాలా అభిమానమట.  సువ్రా ముఖర్జీ మృతి పట్ల పలువురు ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

(Visited 23 times, 1 visits today)