నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసును మూడు రోజుల్లో ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డు ప్రకటించారు.
శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వా రిని అభినందించిన అనంతరం ఆయన మాట్లాడు తూ కేసు విచారణలో అధికారులు, సిబ్బంది టీమ్ వర్క్, సాంకేతిక పరిజ్ఞానంతోనే కేసును త్వరితగతి న ఛేదించామన్నారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందరికీ శిక్ష పడేలా పనిచేయాల్సిన బాధ్య త కూడా పోలీసుసిబ్బందిదేనన్నారు. హత్యలో పా ల్గొన్న నిందితులందరినీ కోర్టులో హాజరు పర్చామ న్నారు. కాగా రివార్డులందుకున్న వారిలో మిర్యాల గూడ డీఎస్పీ శ్రీనివాస్, హాలియా సీఐ ధనుంజ య, నల్లగొండ టూ టౌన్ సీఐ మహబూబ్‌పాష, శాలిగౌరారం సీఐ క్యాసో్ట్రరెడ్డి, విజయపురి టౌన్ సీఐ వేణుగోపాల్, ఐటీ కోర్ సీఐ సురేష్‌కుమార్, ఎస్ ఐ రాజశేఖర్‌రెడ్డిలతోపాటు కానిస్టేబుళ్లు ఫయాజు ద్దీన్, గౌస్, రఫియా ఉన్నారు. కార్యక్రమంలో అడిష నల్ ఎస్పీ పద్మనాభరెడ్డి, నల్లగొండ, దేవరకొండ డీఎస్పీలు గంగారాం, మహేశ్వర్, ఏఆర్ డీఎస్పీ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.