Home / Inspiring Stories / రైలులో అమ్ముడయ్యే ఆహార పదార్థాల అసలు రేట్లు తెలుసుకోండి.

రైలులో అమ్ముడయ్యే ఆహార పదార్థాల అసలు రేట్లు తెలుసుకోండి.

Author:

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే సంస్థలలో భారతీయ రైల్వేస్ ఒకటి, రోజుకు కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చుతూ ఎంత మంచి పేరు సంపాదించిందో, తమ ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించండంలో విఫలమై అంతే చెడ్డ పేరు సంపాదించుకుంటుంది. రైల్వే పైఅధికారులు ఎన్ని మంచి అలోచనలు చేసినా క్రింది స్థాయి అధికారులకు అంత చిత్తశుద్ధి లేకపోవడంతో ఆ అలోచనలు పెడదారి పడుతున్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణిస్తున్న రైల్లలో ప్రయాణికులకు భోజనం అందించడానికి పాంట్రీ కారు క్యాటరింగ్ సౌకర్యం ఉంటుంది. ఆ క్యాటరింగ్ వారు ప్రయాణికులకు అసలు ధర కన్న ఎక్కువ ధరలకు ఆహార పదార్థాలు అమ్మి ప్రయాణికుల వద్ద కోట్లు దోచుకుంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా ఆ రైలులోని క్రింది స్థాయి అధికారులు ప్రయాణికుల బాధలను పట్టించుకోవడం లేదు. దీనిపై లక్షల్లో ఫిర్యాదులు రావడంతో స్పందించిన రైల్వే శాఖ అన్ని రైల్వే స్టేషన్లలో మరియు రైల్లలో అమ్మే అహార పదార్ధాలు ఎంత ధరకు అమ్మాలో నిర్ణయించి వాటికి ప్రకటించింది. ఆ ధరలు క్రింద చూడండి.

rates of meal items in trains rates card

పాంట్రీ కారు వారు ఇష్టం వచ్చినట్టు రైలు ప్రయాణికులకు ఎక్కువ ధరలకు ఆహార పదార్థాలను అమ్ముతూ ప్రయాణికుల దగ్గరి నుండి ఎక్కువ మొత్తంలో దోచుకుంటున్నారని రైల్వే శాఖ రైల్వే స్టేషన్, రైలు లోపల లభించే ఆహార పదార్థాలకి ధరలని నిర్ణయించింది, పైన చెప్పిన పదార్ధాలు కాకుండా వేరే పదార్ధాలను ఆర్డర్ చేయాలనుకుంటే ముందుగా క్యాటరింగ్ వారిని మెను కార్డు అడిగి అందులో సూచించిన విధంగా ధరలు చెల్లించాలని ప్రకటించారు రైల్వే అధికారులు, పాంట్రీ కారు వారు ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తే వారి నుండి బిల్ ఖచ్చితంగా తీసుకోని రైల్వే అధికారులకి ఫిర్యాదు చేయాలనీ అధికారులు సూచించారు.

 

(Visited 1,565 times, 1 visits today)