Home / Inspiring Stories / భారతదేశ చరిత్రలోనే తొలి హిజ్రా ఎస్సై ప్రీతికా యాషిని.

భారతదేశ చరిత్రలోనే తొలి హిజ్రా ఎస్సై ప్రీతికా యాషిని.

Author:

మన దేశ చరిత్రలోనే మొట్టమొదటి సారి ఒక హిజ్రా సబ్ ఇన్స్ స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించింది, తమిళనాడు రాష్ట్రం సేలం ప్రాంతానికి చెందిన ప్రీతిక యాషిని ఎస్సై ఉద్యోగానికి అప్లై చేసింది, కానీ తాను హిజ్రా అనే కారణంతో అధికారులు తనని పరీక్షలకి అనుమతించలేదు, దీనిపై కోర్ట్ కి వెళ్లిన ప్రీతిక, అనేక అవమానాల తరువాత కోర్ట్ ఉత్తర్వుల సహాయంతో పరీక్షా రాసింది, మిగిలిన అన్ని అర్హత పరీక్షలలో ప్రతిభ కనబరిచిన ప్రీతిక యాషిని ఎస్సై ఉద్యోగానికి ఎంపిక అయింది.

Prithika Yashini is India's first transgender police officer

ధర్మపురి పోలీస్ స్టేషన్ కు ఎస్సైగా పోస్టింగ్ ఆర్డర్ అందుకుంది ప్రీతికా యాషిని. త్వరలో లాఠీ పట్టడానికి రెడీ అయింది ఈ హిజ్రా లేడీ.అన్ని టెస్టులను అధిగమించిన యాషినికి.. తమిళనాడు పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులను అందచేశారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎలాంటి నిరాశకు లోను కాకుండా విజయం సాధించిన ప్రితికా యాషిని తన ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించి సమాజం కోసం తన జీవితాన్ని ధారపోస్తానని చెప్పింది.

(Visited 1,078 times, 1 visits today)