Home / Inspiring Stories / నింగిలోకి దూసుకెళ్ళిన PSLV-C36 రాకెట్.

నింగిలోకి దూసుకెళ్ళిన PSLV-C36 రాకెట్.

Author:

మనది వ్యవసాయ అధారిత దేశం కాని మన కన్నా చిన్న దేశాలు సాంకేతికతతో దూసుకుపోతు మన రైతుల కన్న ఎక్కువ ఉత్పత్తి సాధిస్తున్నారు. మన రైతులకు వాతవరణం, నీటిలభ్యత మరియు ఇతర వ్యవసాయ అధారిత సాంకేతికత మీదా అవగాహణ లేకపోవడంతో పంట ఉత్పత్తిని పెంచుకోలేక నష్టాల భారీన పడుతున్నారు. అలాంటి కష్టాల నుండి రైతులను కాపాడేటందుకు భారతీయ శాస్రవేత్తలు మరియు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కలిసి రీసోర్స్ శాట్-2ఎ అనే ఉపగ్రహాన్ని తయారుచేసి పీఎస్ఎల్వీ-సీ36 వాహాకనౌఖ ద్వారా ఈ రోజు విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు.

రీసోర్స్ శాట్-2ఎ ఉపగ్రహం ఉపయోగాలు:
రీసోర్స్ శాట్-2ఎ ఉపగ్రహాన్ని భూమి పరిశీలన కోసం కక్షలోకి ప్రవేశపెట్టారు. రాబోయే కాలంలో వాతావరణం, నీటి లభ్యత, పంట తెగుళ్ళు, జల వనరుల గురించి ఈ ఉపగ్రహం మన శాస్రవేత్తలకు కచ్చితమైన సమాచారం అందించనుంది. ఈ సమాచారాన్ని వారు రైతులకు చేరవేసి పంటలకు తగు సూచనలు చేస్తారు. అంతే కాకుండా ఈ ఉపగ్రహం దేశ రక్షణ రంగానికి సంబంధించిన సమాచారాన్ని కూడా అధికారులకు తెలియజేసి దేశ రక్షణకు కూడా ఉపయోగపడుతుంది.

(Visited 357 times, 1 visits today)