Home / Inspiring Stories / అగ్రదేశాల వలన కానిది, మన ఇస్రో కి సాధ్యపడింది.

అగ్రదేశాల వలన కానిది, మన ఇస్రో కి సాధ్యపడింది.

Author:

భారతదేశం గర్వించదగ్గ సమయం ఆసన్నం అయ్యింది, గొప్ప సాంకేతికత సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న అగ్ర దేశాలు చేయలేని పనిని చేసి చూపడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రెడీ అయింది. విజయవంతమైన వాహక నౌక పీఎస్ఎల్వీ-సీ37 ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి చరిత్ర సృష్టించనుంది ఇస్రో. ఫిబ్రవరి 15 న ఉదయం 9 గంటల 28 నిముషాలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని లాంచ్ ప్యాడ్ నుంచి పీఎస్ఎల్వీ-సీ37 నింగిలోకి దూసుకుపోనుంది.

pslv-c37

పీఎస్ఎల్వీ-సీ37 ద్వార భారత దేశానికి చెందిన కార్టోశాట్ 2 సిరీస్ శాటిలైట్,ఐఎన్ఎస్-1ఏ, ఐఎన్ఎస్-1బీ శాటిలైట్ల తో పాటు ఇతర దేశాలకు చెందిన 101 శాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. పీఎస్ఎల్వీ-సీ37 మోసుకెళ్తున్న మొత్తం శాటిలైట్ల బరువు 1378 కేజీలు. పైన చెప్పిన శాటిలైట్ల లో అమెరికాకు చెందినవే ఎక్కువగా ఉన్నాయి. 28 నిమిషాల 42.8 సెకన్లలో పూర్తి కానున్న ఈ ప్రయోగం ద్వార అన్ని శాటిలైట్లను భూమి నుంచి 505కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలార్ సన్ సింక్రనస్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో కి భారీ ఆదాయంతో పాటు అంతరిక్ష రంగంలో మరో మైలురాయిని అందుకునే అవకాశం ఉంది.

(Visited 638 times, 1 visits today)