Home / General / అమ్మాయిలు, అబ్బాయిలు ఉపాధ్యాయులు కూడా.. ఇక జీన్స్‌, టీషర్టులు ధరిస్తే కఠినమైన చర్యలు?

అమ్మాయిలు, అబ్బాయిలు ఉపాధ్యాయులు కూడా.. ఇక జీన్స్‌, టీషర్టులు ధరిస్తే కఠినమైన చర్యలు?

Author:

ఇక్కడ అమ్మాయిలతో పాటు అబ్బాయిలు, ఉపాధ్యాయులు కూడా జీన్స్‌ ధరించరాదంటూ పంజాబ్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ నిబంధన అక్టోబరు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు నోటీసులు పంపించింది. ఎవరైనా నిబంధనను ఉల్లంఘించి జీన్స్‌, టీషర్టులు ధరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించింది. ‘తరగతుల వరకు మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుందని, హాస్టల్స్‌లో ఎలాగైనా ఉండొచ్చని తెలిపింది. అమ్మాయిలు, అబ్బాయిలు జీన్సులు, టీషర్టులు ధరించి కళాశాలకు రావడం అనాగరికంగా ఉంది. అందుకే వాటిపై నిషేధం విధిస్తున్నాం.

ఎంబీబీఎస్‌, బీఎస్‌, అన్ని డిప్లొమా కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుంది. అమ్మాయిలు ఇక మీదట కళాశాలకు సల్వార్‌ సూట్‌ లేదా ట్రౌజర్‌-షర్ట్‌ వేసుకొని రావాలి, అబ్బాయిలు అదే మాదిరిగా ట్రౌజర్‌-షర్ట్‌ వేసుకొని రావాలి’ అంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. కళాశాలలో వైద్య వృత్తి అనే వాతావరణం ఏర్పడేందుకు ఈనిర్ణయం తీసుకున్నారు.

Punjab Govt Medical College bans students from wearing jeans and Tshirt

అయితే.. కళాశాల తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థులు, అధ్యాపకులు ఎవరూ వ్యతిరేకించలేదు. ఇటువంటి విషయాలు ముఖ్యమైనవి కాదని, కేవలం నాణ్యమైన విద్య అందించడమే తమకు కావాలని అన్నారు.

(Visited 1 times, 1 visits today)