Home / Entertainment / రాధే మా జీవిత కథని సినిమా గా తీయబోతున్నారా..?

రాధే మా జీవిత కథని సినిమా గా తీయబోతున్నారా..?

Author:

ఏ సంచలన సంఘటన జరిగినా తెరకెక్కించటం లో ముందుండే మన సినిమా పరిశ్రమలో ఇంకో ప్రయత్నం మొదలయ్యింది. ఆధ్యాత్మికత ముసుగులో సెక్స్ రాకెట్ నడిపారని ఆరోపణలెదుర్కున్న రాధే మా జీవిత కథనే సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  “ఆమె నన్నొక అపరిచితుని తో సెక్స్ సంబందం పెట్టుకొమ్మని ఒప్పించాలని చూసారు” రాధే మా పై బిగ్ బాస్ ఫేం అప్ డాలీ బింద్రా అన్న ఈ మాటలతో ఒక్కసారిగా వివాదం ఊపందుకుంది. దేశవ్యాప్తంగా దుమారం రేగింది.

రాధే మా జీవిత కథ మన దర్శకులనూ ఆకర్శించింది. పంజాబ్ లోని పల్లెటూరిలో టైలరింగ్ చేస్తూ సాధారణ గృహిణిలా ఉన్న “సుక్వీర్ కౌర్” అనే అమ్మాయి భర్తతో విడి పోయి ముంబాయి వచ్చి అధ్యత్మికత వైపు మళ్ళి అత్యాధునిక సౌకర్యాల ఆశ్రమం, తన పేరుతో సొంత ఊరికి దగ్గరలో గుడీ నిర్మించుకునే దాకా ఎలా ఎదిగింది, ఎన్ని కథలు సాగించిందీ అనేదే ప్రధానాంశం గా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. శృంగారానికి ఎక్కువ స్కోప్ ఉండే ఈ సినిమాలో ప్రేక్షకులని కవ్వించే హీరోయిన్ కోసం వేటమొదలయ్యింది. ఉన్నదున్నట్టుగా తీస్తే మాత్రం మత్తెక్కించే శ్రుంగార దృశ్యాలు ప్రెక్షకులకు కనువిందు చేయనున్నాయి.  ఈ పాత్రకోసం నయనతార లేదా మరో బెంగాలీ నటి పేరు వినిపిస్తోంది. మరి ఈ అందాల దేవత గా ఏ నాయిక నటిస్తుందో ఎదురు చూడాల్సిందే

(Visited 93 times, 1 visits today)