Home / Inspiring Stories / నాకు గౌరవ డాక్టరేట్ వద్దు…నేనే రీసెర్చ్ చేసి డాక్టరేట్ సాధించుకుంటా: ద్రవిడ్

నాకు గౌరవ డాక్టరేట్ వద్దు…నేనే రీసెర్చ్ చేసి డాక్టరేట్ సాధించుకుంటా: ద్రవిడ్

Author:

ఏదైనా రంగంలో ప్రతిభావంతమైన కృషి చేసిన వారిని ప్రముఖ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్ లతో సత్కరిస్తాయి. దీనివలన ఆ ప్రముఖులకు మరియు ఆ యూనివర్సిటీలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. కాని అలా వచ్చిన అవకాశాన్ని సున్నితంగ తిరస్కరించాడు భారతదేశ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. ప్రఖ్యాత బెంగళూరు యూనివర్సిటి, రాహుల్ ద్రవిడ్ భారతదేశ క్రికెట్ కి చేసిన కృషిని అభినందిస్తూ 2017 సంవత్సరానికి తమ యూనివర్సిటి తరపున గౌరవ డాక్టరేట్ ని ప్రకటించింది. అదే విషయాన్ని పత్రికా ముఖంగా ప్రకటించింది.

Rahul-Dravid

కాని బెంగళూరు యూనివర్సిటి ప్రకటించిన గౌరవ డాక్టరేట్ ని సున్నితంగా తిరస్కరించాడు రాహుల్ ద్రవిడ్. ఇదే విషయాన్ని యూనివర్సిటి వారికి తెలిపిన ద్రవిడ్, తనకు గౌరవ డాక్టరేట్ వద్దని, తనే క్రికెట్ ఆట మీదా ఎదైన పరిశోధన చేసి ఆ డాక్టరేట్ సాధిస్తానని, ఎదైనా కష్టపడి సంపాదిస్తేనే అందులో ఆనందం ఉంటుందని ప్రకటించాడు. ఈ చర్యను అందరూ అభినందించారు. రాహుల్ తన ఆటతోనే కాదు, తన వ్యక్తిత్వంతో కూడా చాలా మంది కొత్త అభిమానులను పోందాడని సోషల్ మీడియాలో అభిమానులు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు.

(Visited 176 times, 1 visits today)