Home / Inspiring Stories / రైల్వే పై కేసు వేసి 14 సంవత్సరాల తరువాత విజయం సాధించిన మహిళ.

రైల్వే పై కేసు వేసి 14 సంవత్సరాల తరువాత విజయం సాధించిన మహిళ.

Author:

మన రైళ్ళలో దొంగతనాలు జరగడం సర్వ సాధారణం, రైలులో వస్తువులు చోరీకి గురైతే వచ్చే స్టేషన్ లో దిగి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసి ఎవరి దారిన వారు పోతాం, వారు తీసుకునే చర్యలు శూణ్యం మరల జరగాల్సిన దోపీడీలు జరుగుతూనే ఉంటాయి కాని ఒక 74 సంవత్సరాల మహిళ తన రైలు ప్రయాణంలో దోపీడీకి గురి అయిన తన నగలకు రైల్వే వారిదే బాధ్యత అని కేసు వేసి 14 సంవత్సరాలు పోరాడి చివరికి విజయం సాధించింది. ఆ ఆదర్శ మహిళ గురించి క్రింద చదవండి.

robbery in train

2003 లో రాధ అనే మహిళ ఢిల్లీ నుండి సికింద్రాబాద్ రావడానికి కొంగు ఎక్స్ ప్రెస్ రైలులో 3 టైర్ ఏసీ కంపార్టుమెంట్ లో టికెట్ తీసుకొని బయలుదేరింది, తన వద్దనున్న బంగారు నగలు, డబ్బు అంతా తన సూట్ కేసులో పెట్టుకొని తనకు కేటాయించిన సీటులో కూర్చుంది. రైలు కదిలే సమయానికి ఆ కంపార్టుమెంట్ మొత్తం మమూలు టికెట్ తీసుకున్న మరియు అనధికార ప్రయాణికులతో నిండిపోయింది. ఇదే విషయాన్ని టికెట్ కలెక్టర్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దానితో చేసేదేమిలేక అమే అలానే ప్రయాణం కొనసాగించింది. రాత్రి 1 గంటకు రైలు భోపాల్ కి చేరుకున్నాక రాధ సూట్ కేసును ఎవరో దొంగిలించారు. అదే విషయాన్ని ఆమె ఆ కోచ్ లో ఉన్న అటెండెంట్ కి ఫిర్యాదు చేసి రశీదు తీసుకుంది. కాని ఎన్ని రోజులైన రైల్వే పోలీసుల నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో వినియోగదారులు కోర్టులో ఫిర్యాదు చేసింది.

కోర్టు వారి నోటీసులకు స్పందించిన రైల్వే శాఖ దొంగతనం జరగడానికి రైల్వే శాఖ కు సంబంధం లేదని, 1989 రైల్వే యాక్ట్ ప్రకారం తమ లోపం లేకుండా జరిగిన సంఘటనకు తాము బాధ్యులం కామని వాధించింది. రైల్వే శాఖ తరపున వాధించిన న్యాయవాది ఒక అడుగు ముందుకేసి ప్రయాణ సమయంలో ఎవరి వస్తువులకు వారే బాధ్యులని దానికి రైల్వే సంస్థ ఎలా బాధ్యత వహిస్తుందని వితండవాదం చేసారు. రైల్వే వారి వాదనల్తో ఏకీభవించని వినియోగదారుల కోర్టు, టికెట్ డబ్బులు చెల్లించి రైలు ఎక్కినప్పుడు ప్రయాణికులతో పాటు వారి వస్తువులకు కూడా రైల్వే వారు రక్షణ కల్పించాలని రైల్వే వారిని అదేశించింది. అంతే కాకుండా 3 టైర్ ఏసీ కంపార్టుమెంట్ లో రాధ సూట్ కేసు మాయమవడాన్ని సీరియస్ గా తీసుకున్న కోర్టు అందులో ఉన్న నగలకు ప్రత్యామ్న్యాయంగా 1,34,400 రూపాయలు నష్ట పరిహారంగా చెల్లించాలని రైల్వే వారిని అదేశించింది. చివరకు రాధ కు న్యాయం జరిగిన అమే ఈ కేసుపై 14 సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది.

(Visited 4,313 times, 1 visits today)