Home / Inspiring Stories / యాడ్ ఇవ్వలేదని వేధిస్తున్నందుకు లైవ్ లో రిపోర్టర్ పై చేయి చేసుకున్న డాక్టర్.

యాడ్ ఇవ్వలేదని వేధిస్తున్నందుకు లైవ్ లో రిపోర్టర్ పై చేయి చేసుకున్న డాక్టర్.

Author:

ఎదైనా సంఘటణ జరిగినప్పుడు అసలు నిజం తెలుసుకోకుండా బ్రేకింగ్ న్యూసుల పేరుతో మన తెలుగు న్యూస్ టీవీ చానెళ్ళు చేసే అతి మనం రోజు చూస్తూనే ఉంటాం. బ్రేకింగ్ న్యూసు అని ఒక తప్పుడు వార్త వేసి అసలు విషయం తెలిసిన తర్వాత నిర్లజ్జగా, క్షమాపణ కూడా చెప్పకుండా వార్తలు మార్చుతున్న చానెళ్ళు కోకొల్లలు. వివిధ కంపనీలు ఇచ్చే ప్రకటణల మీదే అన్ని టీవీ చానెళ్ళ ఆదాయం అదారపడి ఉంటుంది, అయితే ఆ ప్రకటణల కోసం వ్యాపారస్తులను టీవీ చానెళ్ళు ఏ విధంగా బెదిరిస్తాయో ఒక వీడియో బయటకు వచ్చింది.

రాజమండ్రి లోని ఒక ఆసుపత్రి వారిని తమ చానెల్ లో ప్రకటణ ఇవ్వాల్సిందిగా కోరాడు టీవీ 5 రిపోర్టర్, దానికి ఒక సంవత్సారానికి 5 లక్షల రూపాయలు చెల్లించాలని ఆ ఆసుపత్రి డాక్టర్ ని కోరాడు. అంత చెల్లించలేమని చెప్పినందుకు ఆ టీవీ 5 రిపోర్టర్ ఆ అసుపత్రి గురించి తప్పుగా వార్త తయారు చేయడం మొదలు పెట్టాడు దాన్ని అడ్డుకొని అసలు జరిగింది చెప్పడానికి ప్రయత్నించాడు ఆ డాక్టర్. దానితో ఆ ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది, అవేశం ఆపుకోలేకపోయిన ఆ డాక్టర్, టీవీ 5 రిపోర్టర్ ని బాగానే వాయించాడు. ఇప్పుడు ఆ వీడియో ఆన్లైన్ లో వైరల్ గా మారింది. మీరు కూడ పైన చూసేయ్యండి.

(Visited 4,139 times, 1 visits today)