ఇటీవల ఒక వారం రోజుల గ్యాప్‌లో రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ స్టోరీలు అందించిన ‘ బాహుబలి, భజరంగీ భాయిజాన్’ చిత్రాలు ఘనవిజయం సాధించి 500కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించడంతో ఇప్పుడు ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ రెండు విజయాలను చూస్తే అందులోని కథాబలాలేే చిత్రానికి బలమైన ఎస్సెట్. ఇటీవల ఓ వేడుకలో సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్, విజయేంద్రప్రసాద్‌ని కలిశారని, అప్పుడు విజయేంద్రప్రసాద్ మంచి కథతో వస్తే ఆయన దర్శకత్వంలోనే ఓ చిత్రం చేస్తానని రజనీ మాట ఇచ్చాడట. కాగా విజయేంద్రప్రసాద్ గతంలో నాగార్జున ప్రధానపాత్రలో ‘రాజన్న’ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ‘బాహుబలి, భజరంగీభాయిజన్’లు విజయేంద్రప్రసాద్ పేరును దేశవ్యాప్తంగా పాపులర్ చేసాయి. అయితే విజయేంద్రప్రసాద్ చెప్పబోయే కథకు మళ్ళీ కొడుకు రాజమౌళి మాత్రమే డైరెక్షన్ చేస్తాడని, రజనీకాంత్ రాజమౌళి డైరెక్షన్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మరో న్యూస్.. చూడాలి మరి బాహుబలి 2 తరువాత రాజమౌళి ఏం చేయబోతున్నాడో? ఏ సినిమా ఎవరితో ఉండబోతుందో ?