బాహుబలి విజయం తో దేశం మొత్తాన్ని తన వైపుకి తిప్పుకున్న మన సూపర్ కమర్షియల్ డైరెక్టర్ రాజమౌళి తన అమ్ముల పోదిలోంచి మరో పదునయిన ఆయుధాన్ని బయటకు తీయనున్నాడు. అదే తన కలలకు ప్రతిరూపం మహాభారతం. బహుభాలి 2 వీలయినంత త్వరగా కంప్లీట్ చేసి భారతాన్ని సినిమాగా తెరకెక్కి0చాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాట్ట. బహుభాలి విజయం తో మన జక్కన్న ఆలోచనలు మారిపొయాయంట. ఇప్పటికే చాలాసార్లు తన మహాభారతం సినిమా కోరికని బయటపెట్టిన జక్కన్నకు బాహుబలి విజయం కావాల్సినంత ధైర్యాన్నిచ్చింది. ఇదే విషయం రాజమౌళి తండ్రి, రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ కూడా పలు ఇంటర్వ్యూ లలో చెబుతున్నారు.
మరో గుడ్ న్యూస్ ఏంటంటే మన బాహుబలి ప్రభాస్ తోనే ఈ సినిమా తెరకెక్కనుంధీ . దీనికోసం ఇప్పటికే జక్కన్న ప్రభాస్ ని మరో 5 ఏళ్ళు టైం కేటాయించాలని కూడా అడిగినట్టు ఫిలిం నగర్ ఇన్ఫర్మేషన్.
(Visited 704 times, 1 visits today)