Home / Reviews / రజినికాంత్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన “రోబో 2.ఓ” అంచనాలను అందుకుందా.? స్టోరీ, రివ్యూ అండ్ రేటింగ్!

రజినికాంత్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన “రోబో 2.ఓ” అంచనాలను అందుకుందా.? స్టోరీ, రివ్యూ అండ్ రేటింగ్!

Author:

భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన సినిమా రోబో 2.ఓ. ఐదు వందల కోట్ల బడ్జెట్‌ తో నిర్మించిన సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్, యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్, అందాల భామ అమీ జాక్సన్ లాంటి భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఆడియన్స్ తో హిట్ టాక్ సంపాదించుకుందా.? డైరెక్టర్ శంకర్ శ్రమ ఫలించిందా.? రివ్యూ చూసేద్దాం రండి.

కథ:

సిటీలోని అందరి మొబైల్ ఫోన్స్ ఒక్కసారిగా మాయం అవుతాయి. పోలీసులకు అర్ధంకాని పరిస్థితి నెలకొంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి డాక్టర్ వాసికర్ ని సాయం చేయమని అడుగుతుంది ప్రభుత్వం. అసలు కారణం కనిపెట్టడం కోసం చిట్టిని మరోసారి తయారు చేయాలి అంటారు వాసికర్. మొదట్లో ప్రభుత్వం అంగీకరించాడు. చివరికి పరిస్థితి విషమించడంతో ప్రభుత్వం చిట్టిని ప్రవేశపెట్టడానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత చిట్టి ఆ సెల్ ఫోన్ కాకిని ఎలా ఎదురుకుంటుంది? పక్షి రాజా ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అనేవి తెలియాలంటే రోబో 2.ఓ చూడాల్సిందే.!

అలజడి విశ్లేషణ:

సూపర్ స్టార్ రజినీకాంత్, యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్, అందాల భామ అమీ జాక్సన్ లాంటి భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీకి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. డైరెక్టర్ శంకర్, రజినీకాంత్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అక్షయ్ కుమార్ నటన అమోఘం అంటున్నారు. ఈ సినిమాలోని విజువల్స్ కళ్లు తిప్పుకోనివ్వడం లేదని చెబుతున్నారు. తొలి అర్ధభాగం శంకర్ డైరెక్షన్ ప్రతిభను తెలిపితే… మలి అర్ధభాగం అతనిలోని సాంకేతిక నైపుణ్యాన్ని బయటపెడుతోందని అంటున్నారు.

ఎప్పటినుండి ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి ఫుల్ ట్రీట్ ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉన్నా..సెకండ్ హాఫ్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. చివరి ముప్పై నిముషాలు ఈ సినిమాకి హైలైట్. పక్షి రాజా ఫ్లాష్ బ్యాక్ ఎమోషన్ అందరికి కనెక్ట్ అవుతుంది. గ్రాఫిక్స్ వర్క్ అయితే సూపర్ అనాల్సిందే. ఇక రెహ్మాన్ సంగీతం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రజినీకాంత్ ఫాన్స్ కి అయితే పండగే.!

ప్లస్ పాయింట్స్ :

  • రజినీకాంత్, అక్షయ్ కుమార్
  • అమీ జాక్సన్
  • ఇంటర్వెల్
  • క్లైమాక్స్ అరగంట
  • సెకండ్ హాఫ్
  • పక్షిరాజా ఫ్లాష్ బ్యాక్
  • గ్రాఫిక్స్

మైనస్ పాయింట్స్ :

  • ఫస్ట్ హాఫ్

పంచ్ లైన్: తిరిగొచ్చిన చిట్టి…రోబో హిట్ ని కంటిన్యూ చేసాడు.

రేటింగ్ :  3.75/5

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

‘రోబో 2.ఓ. ’ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి  ?

(Visited 1 times, 1 visits today)