Home / Entertainment / నైట్ క్లబ్ లో డిజే గా పనిచేస్తున్న రామ్.

నైట్ క్లబ్ లో డిజే గా పనిచేస్తున్న రామ్.

Author:

telugu-actor-ram-photos

త్వరలో హీరో నైట్ క్లబ్ లో డిజే గా పనిచేస్తూ కనిపించనున్నారు యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్. తను నటిస్తున్న తదుపరి సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలోని చివరి పాటని ఇటీవలే గోవాలో షూట్ చేసి షూటింగ్ ని ఫినిష్ చేసారు. రామ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. ఫాదర్ – డాటర్ సెంటిమెంట్ తో రానున్న ఈ సినిమాకి ‘నేను శైలజ’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ పాత్ర ఎలా ఉండబోతుంది అని ఎదుచుసేవారికి ఇప్పుడు ఒక తీపికబురు . రామ్ ఈ సినిమాలో నైట్ క్లబ్ లో పనిచేసే ఓ డిజేగా కనిపించనున్నాడు.

అయితే అది నిజ జీవితంలో కాదు సుమా. ఆయన తాజా చిత్రం కోసం ఆయన ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలోని చివరి పాటని ఇటీవలే గోవాలో షూట్ చేసి షూటింగ్ ని పూర్తి చేసారు. రామ్ మాట్లాడుతూ ‘ నేను నైట్ క్లబ్ లో పనిచేసే డిజేగా కనిపిస్తే, కీర్తి సురేష్ టిపికల్ తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. ఈ సినిమాలో భారీ భారీ లొకేషన్స్ లో తీసిన సాంగ్స్ ఉండవు. అన్నీ కథలో భాగంగా చాలా రియలిస్టిక్ గా ఉంటయని’ రామ్ తెలిపాడు.

(Visited 124 times, 1 visits today)