Home / Entertainment / రామ్ గోపాల్ వర్మ కి పదిలక్షల జరిమానా

రామ్ గోపాల్ వర్మ కి పదిలక్షల జరిమానా

Author:

ఎప్పుడూ వార్తల్లో ఉండే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ మ‌రో హాట్ టాపిక్ తో వార్త‌ల్లో టాప్ ప్లేస్ చేరిపోయారు. అయితే ఇది కాంట్ర‌వ‌ర్సీయ‌ల్ కామెంట్ చేసో, ఇంకెవరి మనోభావాలు దెబ్బ తీసో కాదు. ఈ సారి ఆయనే దెబ్బతిన్నారు. రామ్ గోపాల్ వర్మ ఇన్నేళ్ల సినీ కెరీర్ కే సెన్ష‌ష‌న్ న్యూస్ ఇది. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ద‌ర్శ‌కుడికి ఎదుర‌వ్వ‌ని సంఘ‌ట‌న వ‌ర్మ‌కు ఎదురైంది. ఇంత‌కీ అసలేం జరిగింది?  బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్, ధర్మేంద్ర హీరోలు గా వచ్చిన మల్టీ స్టారర్,అప్పట్లోనే కాదు ఇప్పటికీ ప్రేక్షకులని అలరించే ఇండియన్ క్లాసిక్. “షోలే” సినిమా కాపీ రైట్ హ‌క్కుల‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా ఉల్లంఘించినందుకు రామ్ గోపాల్ వర్మ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది.

రామ్ గోపాల్ వర్మ పై ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.10 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. ఆమ‌ధ్య షోలే సినిమా నిర్మాత మ‌న‌వ‌డు సిస్ చా సిప్ ధాఖ‌లు చేసిన ఫిర్యాదును విచారించిన న్యాయ‌స్థానం సోమ‌వారం తుది తీర్పును ప్ర‌క‌టించింది. అప్ప‌ట్లో రామ్ గోపాల్ వ‌ర్మ‌ – అమితాబ‌చ్చ‌న్, అజ‌య్ దేవ‌గ‌ణ్, మోహ‌న్ లాల్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన ఆగ్ సినిమా షోలే కి రేమేక్ లాంటిదని వర్మ బాహాటంగనే చెప్పారు. ఈ సినిమాలో  చాలా స‌న్నివేశాలు..డైల్ గ్ లు, లిరిక్స్ షోలే సినిమాకు ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో షోలే నిర్మాత మ‌న‌వ‌ళ్లు అప్ప‌ట్లో కేసు వేశారు. దానికి సంబంధించిన తుది తీర్పును కోర్టు సోమ‌వారం ప్ర‌క‌టించింది. ఆగ్ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ సొంత నిర్మాణ సంస్థ ఆర్.జి.వి .ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించారు. కొసమెరుపేంటంటే అంత గొప్ప క్లాసిక్ రీమేక్ అయిన ఆగ్ బాక్స్ ఆఫీస్ వద్ద ధారుణంగా పరాజయం పాలైంది గొప్ప సినిమాని పాడు చేసాడు రామ్ గోపాల్ వర్మ అంటూ అప్పట్లో రామ్ గోపాల్ వర్మ  పై విమర్శలు వెళ్ళువెత్తాయ్. అమితాబ్ కూడా మొహమాటానికి పోయి ఆ సినిమా చేసాను అని వాపోయారట. ఇప్పుడు ఈ తీర్పుతో వర్మ కి మూడు రకాలుగా దెబ్బపడినట్టయింది. ఒకటి సినిమా నిర్మాణ ఖర్చు, రెండు అప్పుడు డామేజ్ అయిన పరువూ,ఇప్పుడు అదనంగా ఈ జరిమానా… ఐతే ఇంకా రామ్ గోపాల్ వర్మ ఈ విషయం పై ఏమీ స్పందించలేదు.

(Visited 148 times, 1 visits today)