Home / Entertainment / రమ్యకృష్ణం భజే.

రమ్యకృష్ణం భజే.

Author:

రమ్యకృష్ణ తెలుగు తెరకు గ్లామర్ తళుకులద్దిన తార గానే ఎక్కువమందికి గుర్తుండి పోతుందారనుకున్నారంతా. ఈ నల్ల పిల్ల ఒక శ్ని అన్నారు, ఆమె నటిస్తే ఇక సినిమా పోయినట్టే అని ఎదురుగానే నవ్వారు. తమిళనాట ప్రముఖ పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలు అన్న టాగ్ తో సినిమాల్లోకి అడుగు పెట్టి రమ్యకృష్ణ అంటే తమిళ వెండితెర వేలుపు అనిపించుకున్న రజినీ కాంత్ కూడా చేతులెత్తి నమస్కరించే స్థాయి కి చేరుకుంది.నీలాంబరిగా రమ్యకృష్ణ నటనకి రజినీ కాంత్ కూడా షాక్ తిన్నారజినీ “నీతో కలిసి నటించినందుకు గర్వంగా ఉంది” రజినీ ఈ మాట ఇంకెవరి తోనూ అని ఉండడు.
రమ్యకృష్ణ ramya krishna as neelambari

1985 ఇద్దరు మితృలు లో హీరోయిన్ గా వచ్చిన రమ్యకృష్ణ నటిగా ఎదగటం అంత ఈజీగా జరగలేదు. మొదటి సినిమా తరవాత ఆమె రెండో చాన్స్ కోసం మూడేళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. 1989 సూత్ర ధారులు అమాయకమైన గంగిరెద్దులోళ్ళ పిల్ల,పట్నం లో చదివే భావకోసం ఎదురు చూసి తీరా చదువుకొని వచ్చిన బావ తనని పట్టించుకోకుంటే కుమిలి పోయే అమ్మాయి.నటనంటే ఏమిటో రమ్యకృష్ణ చూపించింది.

రమ్యకృష్ణ ramya krishna

1992 ఒకరకంగా తెలుగు సినిమా రెండో తరం లోకి అడుగు పెడుతున్న సమయం. జ్యోతి లక్ష్మి,జయమాలిని వంటి వారిని గ్లామర్ కోసం వాడుకొని హీరోయిన్ ని మాత్రం నిండు చీరకట్టులో చూపించే వారు. కానీ 90వ దశకం లో ప్రజల్లోనూ మార్పొచ్చింది. బయట కూడా 20 ఏళ్ళ అమ్మాయి చీర కట్టుకోవటం లేదు.. మరి సినిమాల్లో మాత్రం పాతకాలం లో ఉన్నట్టే ఉంటే రియాలిటీకి దగ్గరగా ఎలా ఉంటుంది!? కానీ అంత బోల్డ్ గా నటించ గలిగే తార లెవరు!? సో కాల్డ్ సిగ్గు అనే అడ్డాన్ని అధిగమించే అమ్మాయి కావాలి. బట్టల్లో కాదు నగ్నత్వం మనసులో నే అనుకునే డైనమిక్ అమ్మాయి కోసం వెతుకుతున్న రాఘవేంద్ర రావుకి ఈ నల్ల పిల్లలో ఏ అందం కనిపించిందో మరి…  అళ్ళుడు గారు కి జోడీ గా రమ్యకృష్ణ ని ఎన్నుకున్నాడు..
రమ్యకృష్ణ ramya krishna

ఆ తర్వాత నుండి కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాలలో హీరోయిన్ అంటే రమ్యకృష్ణే. దాదాపు అవన్నీ విజయవంతమైనవే. రమ్యకృష్ణ నటిస్తే చాలు ఆ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని నిర్మాతలకు కలిగేలా చేశాయి.గ్లామర్ రోల్స్ చేస్తూనే ఆమె ఎంచుకున్న పాత్రలు “ఆహ్వాణం” “అమ్మోరు” లాంటి సినిమాలు రమ్యకృష్ణ ఒక గ్లామర్ డాల్ అన్న వాళ్ళ నోళ్ళని అలా తెరిచే ఉంచేలా చేసాయ్.దాసరి సినిమా “కంటే కూతుర్నే కను” కొంత నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర ఐతేనేం ఆ పాత్ర చేసేది రమ్యకృష్ణ. ఆ పాత్రని చూసి ఎంతమంది తిట్టుకున్నారో… ఆ తిట్లు పాత్రకీ దీవెనలు రమ్యకృష్ణకీ అయి నందీ అవార్డ్ వచ్చింది. 2009 లోనూ “రాజు మహరాజూ చిత్రానికి మరోసారి నంది ని అందుకుంది కూడా.
రమ్యకృష్ణ ramya krishna as ammoru

“రజినీకాంత్” దక్షిణ భారతమే కాదు ప్రపంచ సినీ మార్కెట్ లోనే ఒక స్థానం ఉన్న నటుడు. రజినీ నే ఆశ్చర్యపోయేలా నీలాంబరి కి ప్రాణం పోసింది. తమిళులు అత్యంత అభిమానించే “జయలలిత” తో సమానం గా రమ్యకృష్ణనీ చూసారు. నీలాంబరి ఒక మాస్టర్ పీస్ గా నిలిచిపోయింది.తర్వాత రమ్యకృష్ణ వంశీ అయింది.
రమ్యకృష్ణ ramya krishna

సింహాద్రి,ఈశ్వర్ లలో ఐటం గర్ల్ గా చిందులేసినా,చంద్ర లేఖ లాంటి సినిమాలో సగం సినిమా అసలు కళ్ళు కూడా కదిలించకుండా పడుకునే ఉన్నా,”అమ్మోరు” గా,”సమ్మక్క” గా రౌద్రం గా కనిపించినా,2పీస్ బికినీ తో గ్లామర్ ఒలకబోసినా రమ్యకృష్ణ అంటే ఒక ప్రత్యేక స్థానం.చాలామందికి తెలియని విశయం ఏమిటంటే రమ్యకృష్ణ అద్బుతమైన క్లాసికల్ డాన్సర్. విదేశాల్లోనూ ప్రదర్శణ లిచ్చిన నృత్య కళాకారిని. అప్పటినుంచీ ఇప్పటి దాకా ఇన్ని విభిన్న పాత్రలు “గొప్ప నటి” అనిపించుకున్న వారికి కూడా సాధ్యం కానన్ని వైవిధ్య పాత్రలు దేన్నీ తక్కువగా చూడలేదు. అమ్మొరు గా కనిపించినప్పుడు ఎంత శ్రద్దగా నటించిందో “సీకుల చిన్నది” గా చిందులేసిన పాత్రనీ అంతే గౌరవించింది. అందుకే
రమ్యకృష్ణ ని ఇప్పటికీ సినీ పరిశ్రమ ఒక ప్రత్యేక నటిగానే చూస్తుంది.ఇప్పటికీ ఈ అందాల తార రేంజ్ ఏమాత్రం తగ్గలేదు, నాగార్జునా హీరోగా వస్తున్న కొత్త సినిమా “సోగ్గాడే చిన్ని నాయన” లో ఇప్పటి కుర్రతారలని తల దన్నేలా,మన్మథుడు నాగ్ కి పోటీగా నే కనిపిస్తోంది.

Ramya Krishna

ఈ శివగామి కి పుట్టిన రోజు ఇవాళ (ఎన్నోదని అడగొద్దు… రమ్య కృష్ణ ఎప్పుడూ  @18 అంతే అలజడి.కాం తరపున కూడా హాపీ బిర్త్ డే రమ్యకృష్ణ గారూ..

(Visited 109 times, 1 visits today)