స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ మళ్ళీ తన జోరు పెంచాడు. ఇప్పుడు తన సినిమాల వరుసగా హిట్ లు కొడుతూండటంతో నిర్మాతగా సినిమాలు చేసే విషయంలో కూడ దిల్ రాజ్ తన స్పీడ్ కాస్త స్పీడ్ పెంచాడు. ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలు అంటేనే భయపడిన దిల్ రాజు ఇప్పుడు చిన్న సినిమాల వైపు చూడటం లేదట టాప్ హీరోల సినిమాలే కావాలి అని అంటున్నాడు. ఈ నేపధ్యంలో రవి తేజా హీరోగా ‘ఓ మై ఫ్రెండ్’ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో త్వరలో మొదలుపెట్టబోయే సినిమా పారితోషికం విషయంలో దిల్ రాజు కూ రవితేజాకు భేదాభిప్రాయాలు ఏర్పడినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. అసలు సంగతేంటంటె రవితేజా నటించిన లేటెస్ట్ సినిమా ‘కిక్ -2′ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చెందడంతో మాస్ మహారాజ క్రేజ్ కొంత తగ్గినట్టే కనిపించింది. ఇప్పుడు ఉన్న పరిస్తితుల్లో ముందు అనుకున్న రెమ్యునరేషన్ తానివ్వలేననీ తాను నిర్మించబోయే కొత్త సినిమా కోసం రేటు కొంత తగ్గించుకోమని రవితేజ ను దిల్ రాజ్ కోరారట. అయితే రవితేజ మాత్రం ‘కిక్ 2’ విడుదలకు ముందు దిల్ రాజ్ తనకు ఇస్తాను అన్న పారితోషికం ఇవ్వవలసిందేనని ఈ విషయంలో తాను ఎటువంట మార్పుకూ అంగీకరించనని దిల్ రాజ్ కు నిర్మొహమాటంగా చెప్పాడనీ అనుకుంటున్నారు.
ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘బెంగాల్ టైగర్’ చివరి దశకు చేరుకున్న నేపధ్యంలో తన నెక్స్ ప్రాజెక్ట్ గా దర్శకుడు వేణు శ్రీరామ్ చెప్పిన కథ నచ్చడంతో రవితేజ వెంటనే ఓకే చెప్పేసి. దిల్ రాజ్ కు డేట్స్ ఇచ్చాడని ఫిలింనగర్ టాక్. అయితే ఈసినిమా స్క్రిప్ట్ గురించి జరుగుతున్న చర్చల సమయంలో దిల్ రాజ్ రవితేజా వద్ద ఈ రెమ్యునరేషన్ ప్రస్తావన తీసుకు రావడంతో వారిద్దరి మధ్యా మాటా మాటా పెరిగిందనీ దాంతో ఈ యుద్ధం ప్రారంభం అయింది అని అంటున్నారు. పారితోషికానికి సంబంధించిన విషయాలలో రవితేజా చాల ఖచ్చితంగా ఉంటాడు అనే వార్తలు ఇప్పటికే పారితోషికం విషయమై రవితేజాకు అనేక మంది నిర్మాతలకు భేదాభిప్రాయాలు వచ్చినట్టు చాలాసార్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం క్రేజ్ రీత్యా వెనకపడి ఉన్న రవితేజా ఇలాంటి పరిస్తితుల్లో ఒక భారీ నిర్మాతతో ఇలా పారితోషికం గురించి పట్టుపట్టడం ఆయన కెరీర్ కి ఎంత్మాత్రమూ మంచిది కాదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్యా జరిగే ఈ యుద్దంలో ఎవరూ రాజీ పడతారో ఎవరు గెలుస్తారో అన్న ఉత్సుకతే ఫిలింనగర్ లో చాలామందిలో కనపడుతోంది..