Home / Latest Alajadi / అతి త్వరలో రూ.200 నోటు…!

అతి త్వరలో రూ.200 నోటు…!

Author:

గత సంవత్సరం నవంబర్ లో రూ.1000, రూ.500 నోట్లని రద్దు చేసి కొత్తగా రూ.2000, రూ.500 నోట్లని ప్రవేశపెట్టింది రిజర్వు బ్యాంకు, వెయ్యి నోటుని రద్దు చేసి రెండు వేల నోటుని ప్రవేశపెట్టడంతో చిల్లర సమస్య ఎక్కువైంది, రూరల్, గ్రామీణ ప్రాంతాలలో రూ.2000 తో ప్రజలకి చిల్లర సమస్య ఎదురవుతుంది, అలాగే గత 20 రోజుల నుండి బ్యాంకులలో, ఏటీఎంలలో కూడా నోట్ల కొరత తీవ్రం అయింది, మార్కెట్ లో నోట్ల కొరత తీవ్రం అవ్వడంతో ఈ కొరతని తీర్చేందుకు కొత్తగా రెండు వందల రూపాయల నోట్లను చలామణిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది RBI.

RBI clears proposal to introduce Rs200 notes

కొన్ని ప్రముఖ జాతీయ ప్రత్రికలలో వచ్చిన సమాచారం ప్రకారం కొత్తగా రూ.200 ప్రింట్ చేసి మార్కెట్ లోకి ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంకు రంగం సిద్ధం చేసుకుంది, కేంద్రం ఆమోద ముద్ర వేస్తే త్వరలోనే నోట్ల ప్రింటింగ్ ను ప్రారంభిస్తామంటున్నారు RBI అధికారులు, మార్చి నెలలో జరిగిన రిజర్వు బ్యాంకు డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు , నోట్ల రద్దు అనంతరం డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నా.. అవి అనుకున్నంత మేరకు లేకపోవడం, చిన్న నోట్ల కొరత కొనసాగుతుండడంతో రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అంతేకాదు.. మార్చి నెలలో ఫీల్డ్ వర్క్ చేసిందట RBI. 10 రూపాయల నోటును ప్లాస్టిక్ రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం. అధికారికంగా మాత్రం వీటిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు రిజర్వ్ బ్యాంక్. కేంద్రం ఆమోద ముద్ర వేస్తే వచ్చే జూన్ నుండి ముద్రణ ప్రారంభిస్తారు, అలాగే రూ.2000 నోటుని రద్దు చేసే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని అధికారులు తెలిపారు.

(Visited 1,043 times, 1 visits today)