Home / Political / ఏ ఏ బ్యాంకుకు ఎన్ని కొత్త నోట్లు పంపించారో రిజర్వ్ బ్యాంక్ వారికే తెలియదట.

ఏ ఏ బ్యాంకుకు ఎన్ని కొత్త నోట్లు పంపించారో రిజర్వ్ బ్యాంక్ వారికే తెలియదట.

Author:

పాత నోట్ల రద్దును దేశ ప్రజలు స్వాగతించినా, దానిని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతగా ఫెయిల్ అయ్యాయో స్పెషల్ గా చెపాల్సినా పనిలేదు. నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అనాలోచితంగా తీసుకున్న పలు నిర్ణయాలు ప్రజల కష్టాలను తీర్చడానికి బదులు అందరిని మరింత గందరగోళంలోకి నెట్టాయి. ఇప్పుడు ఆర్బీఐ ప్రతిష్టకే మచ్చ తెచ్చే మరొక సంఘటణ బయటకు వచ్చింది. నోట్ల రద్దు తర్వాత దేశంలో 90% కి పైగా ATM లు చాలా రోజులు పని చేయలేదు. తగినన్ని కొత్త నోట్లను అన్ని బ్యాంకులకు ఇస్తున్నామని ఆర్బీఐ ప్రకటించినా కూడా అవి ప్రజలకు చేరలేదు, చాలా మంది ప్రజలు రెండు వేల రూపాయల కోసం రోజుల తరపడి ATM లైనలో నిల్చున్నారు. ఈ విషయం పై మరింత సమచారం కోరుతూ ఫాక్ట్ లీ సంస్థ సమాచార చట్టం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించింది, వారి నుండి వచ్చిన సమాధానం తెలిస్తే అందరి మతులు పోవడం ఖాయం. పాత నోట్ల రద్దు తర్వాత ఏ ఏ బ్యాంకుకు ఎన్ని డబ్బులు పంపించారో బ్యాంకు వైస్ గా వివరాలు అందించాలని కోరగా అటువంటి వివరాలు తమ దగ్గర లేవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చెప్పారు. ఎంతో పకడ్భందీగా కొత్త నోట్లను తయారు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఎటువంటి లెక్కలు లేకుండా, అడ్డగోలుగా బ్యాంకులకు కొత్త నోట్లు ఎలా పంపిణి చేసిందో ఇప్పుడు ఎవరికి అర్ధం కావడంలేదు. ఒక ప్రణాళిక లేకుండా, ఒత్తిడిలో డబ్బులు లెక్క లేకుండా బ్యాంకులకు పంపడమే ఇన్ని కరెన్సీ కష్టాలకు కారణం అయ్యింది. దీనిపై మరింత సమాచారం ఇక్కడ చూడండి.

RBI doesnot have information on Cash supplied to Banks after Demonetization

నల్లధనాన్ని వెలికితీస్తాం, దొంగ నోట్లను ఏరివేస్తాం అంటూ గత సంవత్సరం నవంబర్ 8 న కేంద్ర ప్రభుత్వం పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. నల్లధనాన్ని వెలికితీయడం పక్కకు పెడితే గత రెండు నెలలుగా సామాన్య ప్రజలు పడుతున్న కరెన్సీ కష్టాలు వర్ణనాతీతం. కొత్తగా వచ్చిన రెండువేల నోటు అవినీతిని, నల్లధనాన్ని తగ్గించాల్సింది పోయి వాటిని ఇంకా పెంచి పోషించేదిగా తయారయ్యింది. ఒక ప్రణాళిక లేకుండా రిజర్వ్ బ్యాంక్ పంపించిన డబ్బులు సామాన్య ప్రజలకు చేరకుండా బ్యాంకు అధికారుల అవినీతితో మరల నల్లధనంగా మారింది.

(Visited 92 times, 1 visits today)