Home / Political / 1000 రూపాయల నాణెం విడుదల చేసాం.. కాని వాడకానికి కాదు: ఆర్బీఐ

1000 రూపాయల నాణెం విడుదల చేసాం.. కాని వాడకానికి కాదు: ఆర్బీఐ

Author:

గత రెండు, మూడు రోజులుగా 1000 రూపాయల కాయిన్ ఫోటో సోషల్ మీడియా హల్ చల్ చేస్తుంది. అది ఫేక్ ఫోటో అని కొందరు కాదు రెండు వేల నోట్లకు చిల్లర దొరకడం లేదని ప్రభుత్వమే వాటిని ముద్రించిందని మరి కొందరు వాదించడం మొదలు పెట్టారు. ఈ విషయం రచ్చ రచ్చ కాకముందే ఆర్బీఐ అధికారులు స్పందించారు. 1000 రూపాయల నాణెం విడుదల చేసింది నిజమే కాని అది మార్కెట్ లో చెల్లుబాటు కొరకు కాదు అని ప్రకటించింది ఆర్బీఐ. మన దేశంలోని పురాతన ఆలయాలలో ఒకటైన బృహదీశ్వరాలయం నిర్మించి 1000 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కొన్ని 1000 రూపాయల స్మారక నాణేలను ముద్రించామని తెలిపింది రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా. అవి కేవలం స్మారక నాణెలని వాటిని కేవలం గుర్తుగా ఉంచుకోవాలి కాని మార్కెట్ లో వాడోద్దని చెప్పడంతో 1000 నాణెం మీద ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికినట్లయ్యింది.

rbi released 1000 rs coin

పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన కొన్ని సంఘటణలు ఆర్బీఐ పరువును గంగ లో కలిపాయి. ప్రొద్దున్నే ఒక కొత్త నిబంధన పెట్టడం, ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో సాయాంత్రానికి దానిని సవరించండం లాంటి పనులు చాల చేసింది ఆర్బీఐ. ఇక 10 రూపాయన నాణెలు చెల్లవంటూ మార్కెట్ లో వస్తున్న వదంతులను ఆపడంలో ఆర్బీఐ ఘోరంగా విఫలమైంది. దానితో పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించేందుకు 1000 రూపాయల నాణేంపై వస్తున్న వదంతులు పెద్దవి కాకముందే స్పందించి ఒక మంచి పని చేసింది.

(Visited 662 times, 1 visits today)