Home / Inspiring Stories / వివాహ సమయంలో పెళ్లి కూతురి చేతిలో కొబ్బరిబోండం ఎందుకో తెలుసా..?

వివాహ సమయంలో పెళ్లి కూతురి చేతిలో కొబ్బరిబోండం ఎందుకో తెలుసా..?

Author:

హిందూ సంప్రదాయంలో జరిగే పెళ్లిళ్లలో పెళ్లి కూతురు ఒక కొబ్బరి బోండాన్ని పట్టుకొని ఉండడాన్ని ప్రతి ఒక్కరు గమనించే ఉంటారు, అలా పెళ్లి కూతురు కొబ్బరి బోండాన్ని మండపంలోకి రెండు చేతులతో పట్టుకొని రావడం వెనుక ఒక కారణం ఉంది.

హిందూ సంప్రదాయం ప్రకారం కన్యాధానం చేసేటప్పుడు..అలంకారాలు చేసి కన్యాధానం చేయాలి, అందుకే పెళ్లి కూతురి చెవులకు కమ్మలు, ముక్కుకి ముక్కెర, చేతికి గాజులు , వడ్డాణం లాంటి ఆభరణాలతో అలంకరిస్తారు, ఆ ఆభరణాలు అన్ని బంగారంతో చేసి ఉండాలి, అందరికి ఇన్ని ఆభరణాలని చేయించే స్థోమత ఉండదు కాబట్టి వీటికి బదులు కొబ్బరి బోండం, ధపు చెక్క, గుమ్మడికాయ లాంటి వస్తువులు కన్యాధానం సమయంలో ఇస్తారు. మన పురాణాల్లో బంగారకంటే ఎక్కువ విలువ ఈ వస్తువులకు ఉంది.

పెళ్లిసమయంలో పెళ్లికూతురు చేతిలో కొబ్బరిబోండం ఎందుకో తెలుసా?

ఇంకో పురాణం ప్రకారం కొబ్బరి బోండాన్ని పూర్ణఫలం అని అంటారు, ఇది భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం ఎలా ఉండాలో బోధిస్తుంది, కొబ్బరి బోండం బయటికి చూడటానికి గట్టిగా ఉంటుంది, కానీ లోపల మాత్రం అమృతం లాంటి నీరు ఉంటాయి, భార్యాభర్తలు కూడా జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా గట్టిగా నిలబడి, వాళ్ళిద్దరి మధ్య ఉండే అమృతం లాంటి అన్యోన్యతతో ఆ కష్టాలని జయించాలని భోదిస్తుంది.

(Visited 1,677 times, 1 visits today)