Home / Political / పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!

పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!

Author:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.2014లో 68.4 శాతం పోలింగ్ జరగగా… ఈసారి కాస్త ఎక్కువగా 69.1 శాతం ఓట్లే పోలయ్యాయి. నిజానికి ఈసారి భారీ పోలింగ్ జరుగుతుందని అందరూ అంచనా వేశారు. వాస్తవ లెక్కలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.హైదరాబాద్ లాంటి చోట్ల 80 శాతం పోలింగ్ జరగాలని టార్గెట్ పెట్టుకొని, ఆ దిశగా పనిచేశారు ఎన్నికల అధికారులు. ఐతే, ఎంత చేసినా ఫలితం నిరాశ పరిచింది.

పాతబస్తీలో కూడా దారుణంగానే ఓటింగ్ నమోదయింది. ఏ నియోజకవర్గం లో కూడా ఓటింగ్ 45 శాతంకి మించి దాటలేదు. ఈ విషయంలో ఈసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెరాసకు వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లు తీసేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి మజ్లిస్ పైన వ్యతిరేకతనా, బోగస్ ఓట్లు తగ్గాయా లేక అంతకుమించి కారణం ఏమైనా ఉందా అని విశ్లేషిస్తున్నారు. ఇది ఇలా ఉండగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది..అదేమిటి అంటే.?

కొద్ది రోజుల క్రితం జామియా నిజామియా అనే సంస్థ ఓ ఫత్వా జారీ చేసింది. బోగస్ ఓట్లు వేసేవారు హరామీలు అని ప్రకటించింది. అంటే పాపాత్ములు అని అర్థం. వారిని దేవుడు క్షమించడని పేర్కొంది. అరబ్ దేశాల్లో ఇలాంటి ఫత్వాలు పాటిస్తారు. ఇప్పుడు పాతబస్తీలోను ఇదే ఫత్వా కారణంగా ఓటింగ్ తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి.మహిళలు బురఖా వేసుకుంటారు. పరాయి మగవాళ్లు చూడకూడదనే నిబంధన ఉంది. దీనిని అడ్డు పెట్టుకొని బురఖా చాటున చాలా బోగస్ ఓట్లు వేసేవారనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు అవి తగ్గాయని అంటున్నారు.

(Visited 1 times, 10 visits today)