Home / Entertainment / చిరు, పవన్ లు కలిసి సినిమా తీయడానికి గల కారణం?

చిరు, పవన్ లు కలిసి సినిమా తీయడానికి గల కారణం?

Author:

టి. సుబ్బి రామిరెడ్డి నిర్మాతగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలసి ఒక సినిమా చేయబోతున్నారన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ విషయం తెలిసినప్పటి నుండి మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. కానీ, ఇప్పటికిప్పుడు అన్నదమ్ములిద్దరూ కలసి సినిమా చేయబోతుండటానికి కారణం ఏంటి అన్నది మాత్రం ఎవ్వరూ పెద్దగా ఆలోచించడం లేదు. ఆ విషయాన్ని కాస్త లోతుగా ఆలోచిస్తే కొన్ని ఆశ్చర్యం కలిగించే విషయాలు అర్ధం అవుతాయి. ఎవరు ఏమి అనుకుంటున్నా, గత కొంత కాలంగా ఈ అన్నదమ్ములిద్దరి మధ్య మ‌న‌స్పర్ధలు వచ్చిన మాట ముమ్మాటికీ వాస్తవమే.

chiru pawan multi starer

తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా అన్నయ్య ని ఎదిరించడమే ఈ గొడవలకి నాంది పలికిందని చెప్పుకోవచ్చు. ఇక అప్పటి నుండి మెగా అభిమానులుగా కలిసి ఉండే అభిమానులు కాస్త, చిరు అభిమానులగాను, పవర్ స్టార్ అభిమానులగాను విడిపోయారు. మెగా సినీ వేడుకల్లో అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ గురించి అందరికి తెలిసిన విషయమే. ఒక ఫంక్షన్ లో అయితే ఏకంగా మెగాస్టార్ నే ఒక ఆట ఆడేసుకున్నారు! ఇక తరువాత అల్లు అర్జున్ రంగంలోకి దిగడం, ఆగ్రహంతో చెప్పను బ్రదర్ అంటూ పవన్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడం, ఆ తరువాత పవన్ అభిమానులందరూ బన్నీని కార్నర్ చేయడం అంతా ఒకదాని తరువాత ఒకటి క్రమంగా జరిగిపోయాయి. ఇక మెగా స్టార్ 150వ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి కూడా పవన్ కళ్యాణ్ రానేలేదు. ఈ పరిణామాలన్నీ ఇన్నర్ గా మెగా బ్రదర్స్ కి ఎలా అనిపించినా బయట నుండి చూస్తున్న అభిమానుల మధ్య గ్యాప్ రావడం ఖాయం. ఇదే విషయాన్ని చిరు, పవన్ కాస్త ఆలస్యంగా గుర్తించారట. రాజకీయంగా తమ దారులు వేరైనా, తమ అందరి బలం మాత్రం అభిమానులే. అందుకే, ఆ అభిమానుల మధ్య చీలికలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు పవర్ స్టార్-మెగా స్టార్ కలసి మల్టీ స్టారర్ చేయక తప్పనిసరి పరిస్థితి ఎదురయింది. కాబట్టి, ఈ అన్నదమ్ములిద్దరూ కలసి సినిమా చేయడానికి కారణం పరోక్షంగా మెగా అభిమానులే కాబట్టి ,ఈ క్రెడిట్ అంతా అభిమానులకే దక్కుతుంది

(Visited 819 times, 1 visits today)