Home / Inspiring Stories / వినాయకుడి విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా?

వినాయకుడి విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా?

Author:

సర్వవిఘ్నాలకు అధినాయకుడైన ఆ విఘ్ననాయకుడిని ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చవితి రోజున భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠిస్తాము. అలా ప్రతిష్ఠించిన వినాయకుడుని 21 రకాల పత్రాలతో, వివిద రకాల నైవేద్యాలతో కొలుస్తాము. నవరాత్రుల తర్వాత వినాయకుణ్ణి దగ్గరలోని చెరువుల్లో, నదుల్లో నిమజ్జనం చేస్తాము. కాని వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా? దీనికి భక్తితో కూడిన వివరణతో పాటు శాస్రీయ కోణం కూడ ఉంది.

ganesh-nimajjan-hyderabad

భక్తుల కోరికలు వినడానికి భువిపైకి వచ్చిన వినాయకుడిని తిరిగి స్వర్గానికి పంపడానికి దగ్గరి దారి సముద్రమే అనే కారణంతో వినాయకుడు విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు. పూర్వకాలంలో వినాయకుడి విగ్రహాలు బంక మట్టితో తయారు చేసేవారు, అలా ఉపయోగించిన మట్టిని తిరిగి ఆ భూమాతకే ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో కూడా విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.

శాస్రీయ కోణం విషయానికి వస్తే వినాయకుడి విగ్రహంతో పాటు పూజ కు ఉపయోగించిన పత్రిని కూడా నీటిలో నిమజ్జనం చేస్తారు. వినాయక పూజలో ఉపయోగించే పత్రిలో విశేష ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పత్రి నేత్ర, మూత్ర, చర్మ సంబంధమైన రోగాలతోపాటు మరికొన్ని ఇతర వ్యాధులకు మంచి మందుగా పనిచేస్తుంది. అలా నీటిలో వేసిన పత్రి ఆకులు తమలో ఉన్న ఔషధగుణాల ఆల్కలాయిడ్స్‌ని నీళ్లలోకి వదిలేస్తాయి. దాని వల్ల నీటిలో ఉండే బాక్టీరియా నిర్మూలన జరిగి నీళ్లల్లో ఆక్సిజన శాతం పెరుగుతుంది. అంతే కాకుండా వర్షకాలంలో ఉప్పొంగి ప్రవహించే చెరువులు, నదులలో ప్రవాహాన్ని తగ్గించి నీటిని భూమిలోకి ఇంకడానికి బంకమట్టి చాల ఉపయోగపడుతుంది ఈ కారణంతో కూడా వినాయకుడి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు. కాని ఈ రోజుల్లో బంకమట్టితో చేసిన విగ్రహాలకు బదులు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో రంగు రంగుల విగ్రహాలను వాడి మన పర్యావరణాన్ని మనమే పాడుచేసుకుంటున్నాము.

Must Read: ఈ చెట్టు 300 రకాల వ్యాధులని రాకుండా చేస్తుంది.

(Visited 12,994 times, 1 visits today)