Home / Latest Alajadi / రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!

రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!

Author:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సెలబ్రిటీస్ కూడా సాధారణ ప్రజల లాగ లైన్ లో నించొని వోట్ హక్కు వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఉదయాన్నే సతమణి తో కలిసి ఓటేశారు. ఆయన కూతురు శ్రీజ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఎలక్షన్స్ లో హాజరుకాలేదు.

ఈ విషయం గురించి రామ్‌చరణ్‌ తన ఫేస్‌బుక్‌లో ‘కొన్ని కారణాల వల్ల నేను నా ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నాను. కానీ దయచేసి అందరూ ఓటు వేయండి’ అంటూ పోస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా రామ్‌చరణ్‌ సతీమణి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకం. ప్రతి ఓటు కౌంటబుల్‌ అవుతుంది. ఓటే మన భవిష్యత్‌ని నిర్ణయిస్తుందనీ.. అందరూ తప్పక ఓటు వేయాలి’ అంటూ ఉపాసన ప్రజలను కోరారు.

ఓటు వేయకుండా చరణ్‌ ఎటు పోయాడో అంటూ అంతా చర్చించుకున్నారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో లేక పోవడం వల్లే ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నాను అంటూ చరణ్‌ పోస్ట్‌ చేశాడు. చరణ్‌ మొన్నటి వరకు ఆర్‌ ఆర్‌ ఆర్‌ మల్టీస్టారర్‌ షూటింగ్‌లో పాల్గొన్నాడు కదా, మరి ఎక్కడకు వెళ్లినట్లు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే చరణ్‌ శబరిమల వెళ్లినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

(Visited 1 times, 1 visits today)