Home / health / ఈ విధంగా చేస్తే నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు.

ఈ విధంగా చేస్తే నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు.

Author:

నడుం నొప్పి ఈ మధ్య ఎక్కువగా అందరి నోటి నుండి వినిపిస్తున్న మాట. ఎందుకంటే ఒకప్పుడు వృద్ధులలో మాత్రమే కన్పించే నడుము నొప్పి ఇప్పుడు వయసుతో నిమిత్తము లేకుండా యుక్త వయసులో ఉన్నవారు సైతం ఎదుర్కొంటున్నారు.దాదాపు 80% మంది ఎప్పుడో అప్పుడు దీని బారిన పడేవారే. శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం వెన్నెముక. ఇది 33 వెన్నుపూసలతో తయారవుతుంది, మనం వంగినా లేచినా వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్‌లు సహాయపడతాయి. నడుము ప్రాంతంలో ఉండే డిస్క్‌లు అరిగిపోవడం వల్ల, లేదా డిస్క్‌లు ప్రక్కకు తొలగి నరాలను కంప్రెస్ చేయడం వల్ల నడుము నొప్పి సమస్య వస్తుంది.

reasons-for-back-pain-and-precautions

నడుము నొప్పికి కారణాలు :

  • కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని విధులను నిర్వర్తించడం.
  • స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీలల్లో అసంబద్ధ బంగిమల్లో కూర్చోవడం.
  • గంటల తరబడి కదలకుండా పని చేయడం.
  • ఈ సమస్య ముఖ్యంగా వెన్నుపూసల మధ్య ఉన్న కార్టిలేజ్‌ క్షీణించి, ఆస్టియోఫై ట్స్‌ ఏర్పడటం వలన వస్తుంది.
  • ప్రమాదాలలో వెన్నుపూసలు దెబ్బ తినడం లేదా ప్రక్కకు తొలగటం.
  • నిత్యం తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమి న్స్‌ లోపించడం వలన నడుము నొప్పి వస్తుంది.

వెన్ను నొప్పికి తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్తలు:

  • కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు కుర్చీ తగినంత ఎత్తులో ఉండేలా చూసుకోండి.
  • ఒకే పొజిషన్‌లో అరగంట కంటే ఎక్కువ సేపు కూర్చోవడం చేయకండి. మధ్య మధ్యలో కాసేపు లేచి నడవండి.
  • శరీర బరువు ఎక్కువ ఉంటే వెంటనే తగ్గించుకోండి.
  • ప్రతిరోజు 8 నుండి 10 గంటల కంటే ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయాల్సి వస్తే బ్యాక్ పెయిన్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

*కింది వీడియోలో చూపించినట్టుగా ప్రయత్నిస్తే నడుము నొప్పిని త్వరగా తగ్గించుకోవచ్చు.

(Visited 5,106 times, 1 visits today)