Home / General / జియో ఫైబర్: రూ.500 లకే 100GB డేటా

జియో ఫైబర్: రూ.500 లకే 100GB డేటా

Author:

మొబైల్ నెట్ వర్క్ మార్కెట్ లోకి అడుగుపెడుతూనే మిగతా నెట్ వర్క్ లకు పట్టపగలే చుక్కలు చూపించిన రిలయెన్స్ జియో ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ రంగంలోకి కూడా అడుగుపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇన్నాళ్ళు కుమ్మక్కై అడ్డగోళుగా కస్టమర్లను దోచుకున్న మొబైల్ నెట్ వర్క్ లు జియో దెబ్బకు రేట్లు తగ్గించి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు రిలయెన్స్ సంస్థ జియో ఫైబర్ పేరుతో మరో సంచలనానికి తెర లేపనుంది. ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్నా అన్ని ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ ప్యాకేజీలను తలదన్నేలా అతి తక్కువ ధరలో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ అందించేందుకు రెడీ అయ్యింది. దీనికి సంభందించి మెట్రో నగరాలలో ఇప్పటికే తమ ఉద్యోగులకు ట్రయల్ బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తున్నట్లు సమాచారం. తొందరలోనే జియో ఫైబర్ ద్వారా నెలకు 500 రూపాయలకే 100Mbps స్పీడుతో 100జీబీ డేటా ఇంటర్నెట్ అందరికి అందుబాటులోకి రానుంది. అంతే కాకుండా జియో మొబైల్ మాదిరిగానే ఫైబర్ కూడా 90 రోజులు ఉచితంగా వాడుకోవచ్చు. 100Mbps స్పీడుతో నెలకు 100GB డేటా వరకు ఉచితంగా ఉండేలా జియో ఫైబర్ ప్లాన్ చేస్తుందని ఇండియా టుడే ఒక కధనాన్ని ప్రచురించింది. ఒకవేళా 100GB డేటా నెలలోపే వాడుకుంటే మిగతా రోజులలో ఇంటర్నెట్ స్పీడు 100Mbps నుండి 1Mbps కు తగ్గుతుంది. ఈ జియో ఫైబర్ ఈ సంవత్సరం దీపావళికి అందరికి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

జియో

ఊహించిన విధంగా జియో ఫైబర్ ని మూడు నెలలు ఉచింతంగా ఇస్తే ఇక కస్టమర్లకు పండగే అని చెప్పాలి అంతే కాకుండా వేలల్లో ఉన్నా బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ ధరలు కొంచెం తగ్గే అవకాశం ఉంది. జియో ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే ఇంటర్నెట్ మాత్రమే కాకుండా జియో అప్లికేషన్లు అయిన జియో టీవీ, మ్యూజిక్, క్లౌడ్ మరియు ఇతర అన్ని అప్లికేషన్లు ఉచితంగా వాడుకోవచ్చు. ఇప్పటికే జియో తో 7 కోట్ల మంది కస్టమర్లను సంపాదించుకున్న రిలయెన్స్ సంస్థ జియో ఫైబర్ తో ఇంక ఎన్ని కోట్ల మందిని తమ వైపుకు తిప్పుకుంటుందో తెలియాలంతే ఇంక కొన్ని రోజులు ఆగాల్సిందే.

(Visited 3,958 times, 1 visits today)