Home / Latest Alajadi / మీరు ఈ నెలలో పుట్టినట్టైతే.. ఈ వ్యాధి వస్తుదంటా…!

మీరు ఈ నెలలో పుట్టినట్టైతే.. ఈ వ్యాధి వస్తుదంటా…!

Author:

జన్మ నక్షత్రాలని బట్టి వ్యక్తుల క్యారెక్టర్ లని అంచనా వేయడం, పుట్టిన రాశులను బట్టి జాతకాలను చెప్పడం మన దేశంలో ఎన్నో సంవత్సరాలుగా ఉంది, ఇప్పుడు వ్యక్తులు పుట్టిన నెలలని బట్టి వారికీ ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందో చెప్పేయొచ్చట. ఆయా నెలలలో పుడితే.. 27 రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని చెబుతున్నారు స్పెయిన్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అలికంట్ పరిశోధకులు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 30వేల మందిపై ఈ పరిశోధనలు చేశారు.

month-wise-infecion

శీతాకాలంలో ఆల్ట్రా వయిలెట్ రేస్, విటమిన్ డీ స్థాయిల్లో భేదాలు, వైరస్ లు స్త్రీలలో పిండం ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయంటున్నారు. అలాగే సెప్టెంబర్ నెలలో పురుషుల్లో థైరాయిడ్ ప్రాబ్లెమ్స్ ఎక్కువగా వస్తాయంటున్నారు. అలాగే జూలైలో పుట్టిన స్త్రీలలో 27 శాతం మందికి హై బీపీ ఉండే అవకాశముందని.. 40శాతం మంది నిగ్రహం కోల్పోయే గుణాన్ని కలిగిఉంటారంటున్నారు ఈ పరిశోధన చేసిన వైద్య బృందం.

నెలల వారీగా స్త్రీ, పురుషుల్లో వచ్చే వ్యాధులు:

జనవరి:

పురుషులు: మలబద్ధకము, అల్సర్, వెన్నునొప్పి

స్త్రీలు: మైగ్రేయిన్, రుతుక్రమ సమస్యలు, హార్ట్ ఎటాక్

ఫిబ్రవరి:

పురుషులు: థైరాయిడ్ సమస్యలు, గుండె సమస్యలు, కీళ్లనొప్పి

స్త్రీలు: కీళ్లనొప్పి, థైరాయిడ్ సమస్యలు, రక్తం గడ్డకట్టుట

మార్చి: 

పురుషులు: శుక్ల సమస్యలు, గుండె జబ్బులు, ఆస్త్మా

స్త్రీలు: కీళ్లవాతం, వాతరోగం, మలబద్ధకం

ఏప్రిల్:

పురుషులు: ఆస్త్మా, ఎముకల వ్యాధి, థైరాయిడ్ ప్రాబ్లెమ్స్

స్త్రీలు: ఎముకల వ్యాధి, ట్యూమర్, శ్వాసనాళాల వాపు

మే: 

పురుషులు: ఒత్తిడి, ఆస్త్మా, డయాబెటీస్

స్త్రీలు: దీర్ఘకాళిక వ్యాధులు, ఎముకల వ్యాధి, మలబద్ధకం

జూన్:

పురుషులు: హార్ట్ కండీషన్స్, కంటి శుక్లాల వ్యాధులు, దీర్ఘకాళికల శ్వాసనాళాల వాపు

స్త్రీలు: నిగ్రహం కోల్పోవడం, కీళ్లవాతం, వాతరోగం

జూలై:

పురుషులు: కీళ్లవాతం, ఆస్త్మా, ట్యూమర్స్

స్త్రీలు: మెడనొప్పి, ఆస్త్మా, ట్యూమర్స్

ఆగస్ట్:

పురుషులు: ఆస్త్మా, ఎముకల వ్యాధి, థైరాయిడ్ సమస్యలు

స్త్రీలు: రక్తం గడ్డకట్టుట, కీళ్లవాతం, వాతరోగం

సెప్టెంబర్:

పురుషులు: ఆస్త్మా, కీళ్లవాతం, థైరాయిడ్ సమస్యలు

స్త్రీలు: కీళ్లవాతం, థైరాయిడ్ సమస్యలు, హానికరమైన ట్యూమర్లు

అక్టోబర్:

పురుషులు: థైరాయిడ్ సమస్యలు, కీళ్లవాతం, మైగ్రేయిన్

స్త్రీలు: అధిక కొవ్వు, కీళ్లవాతం, పాండురోగం

నవంబర్:

పురుషులు: దీర్ఘకాళిక చర్మవ్యాధులు, గుండె సమస్యలు, థైరాయిడ్ సమస్యలు

స్త్రీలు: మలబద్ధకం, హార్ట్ ఎటాక్, నరాలు ఉబ్బుట

డిసెంబర్:

పురుషులు: శుక్లసంబంధిత వ్యాధులు, ఒత్తిడి, హృదయ స్పందనలు

స్త్రీలు: శ్వాసనాళాల వాపు, ఆస్త్మా, రక్తం గడ్డకట్టుట

మనకి వ్యాధులు కొన్ని జన్యు సంబంధమైనవి, మరొకొన్ని మనం తినే వాటిపై, పెరిగే పరిస్థితులపై, మరికొన్ని వంశపారంపర్యంగా వస్తుంటాయని అంతర్జాతీయ వైద్యులు ఈ పరిశోధనని కొట్టిపారేశారు.

(Visited 983 times, 1 visits today)