Home / health / బియ్యంని కడిగిన నీటితో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

బియ్యంని కడిగిన నీటితో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

Author:

మనం రోజు సాదారణంగా బియ్యం కడుగుతుంటం కద! మరి కడిగిన నీటిని ఏం చేస్తాం ఊరిలో అయితే పశువులకు వాడుతుంటారు. కానీ పట్టణాలలో అయితే వేస్ట్ గా కడిగిన నీటిని పారబోయడమో.. చేస్తుంటారు అవునా! కానీ ఈ నీటితో మీకు మీ అందన్ని మరింత రెట్టింపు చేస్తుందని తెలుసా! అదేంటి బియ్యం కడిగిన నీటితో ముఖం కడుగడమేంటి అనుకుంటున్నారా! కానీ ఇది నిజం ఎందుకంటే బియ్యం కడిగిన నీటిలో ఉండే విటమిన్స్‌, మినరల్స్‌ చర్మానికే కాకుండా జుట్టుకు కూడా అదనపు సౌందర్యాన్ని అందిస్తాయి. అంతేకాక మొటిమలపై కూడా బియ్యం కడిగిన నీళ్లు ప్రభావం చూపిస్తాయి. ఆలాగే బియ్యం కడిగిన నీటిలో మాములు టిష్యు పేపర్ ని ముంచి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ చర్మం తాజాగా మరియు మృదువుగా మారుతుంది. అలాగే ఈ నీటితో ముఖంపై రాషెస్‌ ఉన్న ప్రదేశంలో నునుపుగా రుద్దితే మంచి గుణం కనిపిస్తుంది. పదిహేను నిమిషాల వ్యవధిలో రెండుసార్లు బియ్యం కడిగే నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖంపై రాషేస్ తగ్గుతాయి.

rice-water-will-help-to-improve-face-glow

బియ్యం కడిగిన నీటితో ఒక్క ముఖానికే కాకుండ మన జుట్టు కుదుళ్లను కూడా శుభ్రం చేసుకొవచ్చు. ఏలా అంటారా! బియ్యం కడిగిన నీటితో జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే సిల్కీ హెయిర్‌ మీ సొంతం అవుతుంది. ఈ నీళ్లకు ఐదు చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపితే మంచి ఫలితం కనిపిస్తుంది. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే జుట్టు బలంగా మారుతుంది. ఈ నీళ్ళు జుట్టుకు హెయిర్‌ కండీషనర్‌గా పనిచేస్తాయి. బియ్యం కడిగిన నీటికి కాసింత ఎసెన్షియల్‌ ఆయిల్‌, లావెండర్‌ ఆయిల్‌ కలిపి జుట్టుకు రాసి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో హెడ్‌ బాత్‌ చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

(Visited 25,718 times, 1 visits today)