Home / Latest Alajadi / 2.ఓ తొలిరోజు వసూళ్లు ఎంతో తెలుసా.? అడ్వాన్స్ బుకింగ్ ఆధారంగా లెక్కలు ఇవే.!

2.ఓ తొలిరోజు వసూళ్లు ఎంతో తెలుసా.? అడ్వాన్స్ బుకింగ్ ఆధారంగా లెక్కలు ఇవే.!

Author:

భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన సినిమా రోబో 2.ఓ. ఐదు వందల కోట్ల బడ్జెట్‌ తో నిర్మించిన సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్, యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్, అందాల భామ అమీ జాక్సన్ లాంటి భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఆడియన్స్ ప్రశంసలు అందుకుంది.

తమిళ, తెలుగు, హిందీ మూడు భాషల్లో ఈ సినిమా ఈ రోజే విడుదలైంది. తొలి రోజే మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. గతంలో రోబో సినిమా హిందీ వెర్షన్ ఫుల్ రన్ లో 20 కోట్లను వసూలు చేసింది. ఇక 2.ఓ సినిమా హిందీ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజునే 25 కోట్లను వసూలు చేయడం ఖాయమనే అభిప్రాయాన్ని ట్రేడ్ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

అడ్వాన్స్ బుకింగ్ ఆధారంగా ఈ గణాంకాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగు .. తమిళ భాషల్లోను ఈ జోరు కొనసాగుతుందనే విషయం, ఆయా ప్రాంతాల నుంచి వస్తోన్న రెస్పాన్స్ ను బట్టి అర్థమవుతోంది.

(Visited 1 times, 1 visits today)