Home / Inspiring Stories / తెలుగు రాష్ట్రాలని ముంచెత్తనున్న భారి తుఫాన్.

తెలుగు రాష్ట్రాలని ముంచెత్తనున్న భారి తుఫాన్.

Author:

రానున్న 48 గంటల్లో ఆంధ్రా,తెలంగాణా ఒరిస్సా ప్రాంతాలని భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయి, రోను తుఫాను విరుచుకుపడబోతుంది ఇప్పటికే కోస్తాలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు నమోదు అయ్యాయి, రానున్న 48 గంటల్లో 21 సెంటీ మీటర్ల వర్షపాతాన్ని అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ వారి అంచనా ప్రకారం ఆంధ్రలోని అనేక ప్రాంతాలలో రాత్రి నుండీ తుఫాను తాలూకు తీవ్ర ప్రభావం కనిపించవచ్చు, ఆ తరువాత 2 రోజుల పాటు తన ప్రభావం చూపించి కానీ బంగ్లాదేశ్ వైపుగా ప్రయాణించి తగ్గుముఖం పట్టదు.ఈ తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణా పై కూడా ఉండవచ్చు అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

స్వయానా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలి ఆహరం,తాగునీరు నిల్వ చేసుకోవాలని ట్వీట్ చేసారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు , గడిచిన 24 గంటల్లో ఇప్పటికే కాకినాడలో రికార్డు స్థాయిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమెదు అయ్యింది, బాపట్లలో రికార్డు స్థాయిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది, ఇప్పటి పరిస్థితే ఇలా ఉందంటే రానున్న 2 రోజులు పరిస్థితి ఊహించటం కూడా కష్టమైన పనే, కావున అందరూ ముందుగానే మంచినీళ్ళు, ఆహరం అందుబాటులో ఉంచుకుంటే మంచిది. ముందే అన్నీ సిద్దం చేసుకుంటే తప్ప రోను తుఫాను దాటికి తట్టుకుని నిలబడలేము. కరెంటు సదుపాయం కూడా ఉండదు కాబట్టి దోమల బెడద నుండి తప్పించుకోవటానికి జెట్ కాయిల్స్ లాంటి ప్రత్యామ్నయాలు చేసుకుంటే మంచిది.

(Visited 3,203 times, 1 visits today)