Home / Latest Alajadi / ఐటీ అధికారుల సోదాల్లో రూ.70 కోట్ల కొత్త నోట్లు పట్టివేత…!

ఐటీ అధికారుల సోదాల్లో రూ.70 కోట్ల కొత్త నోట్లు పట్టివేత…!

Author:

ఒక్క రెండు వేలు నోటు కోసం సామాన్య జనాలంతా ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తుంటే అక్రమంగా నల్ల ధనాన్ని సంపాదించుకున్న బడా బాబులు మాత్రం దర్జాగా మార్చుకుంటున్నారు, సిబిఐ, ఇన్ కమ్ టాక్స్ డిపార్టుమెంటు అధికారులు కలిసి చేస్తున్న దాడులలో పెద్ద మొత్తంలో కొత్త నోట్లు వెలుగులోకి వస్తున్నాయి, ఈ రోజు చెన్నైలో జరిగిన దాడిలో ఇప్పటివరకు జరిగిన దాడుల కంటే పెద్ద మొత్తంలో కొత్త నోట్లు లభ్యమయ్యాయి.

70-crores-new-currency-in-chennai

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ సభ్యులు, చెన్నైలోనే అతి పెద్ద కాంట్రాక్టర్ అయిన శేఖర్ రెడ్డిపై ఐటీ అధికారులు చేసిన దాడిలో దాదాపు రూ.90 కోట్ల నగదు బయట పడింది, ఈ నగదుతో దాదాపు రూ.70 కోట్లు కొత్త రూ.2వేల నోట్లే కావటంతో అధికారులే నోరెళ్లబెట్టారు, ఇంత పెద్ద మొత్తంలో రూ.2 వేల నోట్లు ఎలా మార్పిడి చేసారు అని ఎవరికీ అంతుపట్టని విషయంగా ఉంది, శేఖర్ రెడ్డికి సంబంధించిన బంధువులు, ఆప్తులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలో చేసిన సోదాల్లో కొన్ని స్థిరాస్తి పాత్రలతో పాటు 100 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.శేఖర్ రెడ్డి తన స్నేహితులతో కలిసి ఇంకో 20 కోట్ల రూపాయలని కూడా మార్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇంత పెద్ద మొత్తంలో నగదు మార్పిడి చేయడంలో ఎవరెవరు ఉన్నారు..? ఏయే బ్యాంకుల నుండి నగదు దారి మళ్లించారు..? వీరికి సహకరించిన బ్యాంకు అధికారుల ఎవరు..? అన్న కోణంలో దర్యాప్తుని చేస్తున్నారు.

(Visited 730 times, 1 visits today)