Home / Inspiring Stories / వృద్ధుడికి బస్ లో సీటు ఇవ్వలేకపోయినందుకు ఆర్టీసీకి రూ.10వేల జరిమానా.

వృద్ధుడికి బస్ లో సీటు ఇవ్వలేకపోయినందుకు ఆర్టీసీకి రూ.10వేల జరిమానా.

Author:

ప్రైవేట్ బస్ లో టికెట్ కొనుక్కొని వారు సీట్ ఇవ్వకుంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కాని అదే ఆర్టీసీ బస్ లో ఐతే? అడిగినా పట్టించుకునే నాదుడే ఉండడు. కాని అడ్డగోలుగా జనాలను ఎక్కించుకొని వారికి కనీస సౌకర్యాలు కల్పించని ఆర్టీసీ పై వినియోగదారుల ఫోరం లొ ఫిర్యాదు చేసి 10,000 రూపాయల పరిహారం పొందాడు 64 ఏళ్ల వృద్ధుడు నాగేందర్.

rtc fined

కిడ్నీ సమస్య, వెన్ను నొప్పితో బాధ పడుతున్న నాగేందర్ సెప్టెంబర్ 23, 2015 న సంగారెడ్డి కి వెళ్ళడానికి పటాన్‌చెరువు లో ఆర్టీసీ బస్ ఎక్కాడు, బస్ అప్పటికే ఫుల్ అయ్యి ఉంది కాని వృద్ధులకు, మహిళలకు ప్రత్యేక సీట్లు ఉంటాయి కదా అందులో కుర్చుందాం లే అని 20 రూపాయలు చెల్లించి టికెట్ తీసుకుని ఆ బస్ కండక్టర్ కి తన బాధ చెప్పుకొని సీట్ ఇప్పించమన్నాడు కాని కండక్టర్ అతని మాట పట్టించుకోలేదు యదావిధిగా అప్పటికే వృద్ధుల సీట్లలో కూర్చున్న వారు లేవడానికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనోవేదనతో అలాగే ప్రయాణం సాగించాడు. మొదటిసారి కావడంతో తనకు జరిగిన అన్యాయాన్ని మెదక్ రీజినల్ డిపో మేనేజరుకు ఫిర్యాదు చేసి ఆ విషయాన్ని వదిలేసాడు. కాని కొన్ని రోజుల తరువాత వేరే బస్ ఎక్కితే మరల ఇంతకుముందు జరిగిన విధంగానే అనుభవం ఎదురయ్యింది ఇక ఈ విషయాన్ని వదలకుండా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలం అవుతున్న ఆర్టీసీ పై వినియోగదారుల ఫోరం లో ఫిర్యాదు చేసాడు.

దీనిపై స్పందించిన ఆర్టీసీ అధికారులు, తమ బస్సులలో వృద్ధులకు ప్రత్యేక సీట్లు ఏమి కేటాయించలేదని, కేవలం వారి మీద గౌరవంతో కొన్ని సీట్లు వారు వచ్చినప్పుడు వారినే కూర్చొనివ్వండి అని బస్సులలో రాసామని, అసలు అప్పటికే కిక్కిరిసి ఉన్న బస్సులో,  వృద్ధుడైన నాగేందర్ ఎక్కకుండా ఉండాల్సిందని, మరో ఖాలీ బస్సు ఎక్కాల్సిందనీ వాదించారు. ఆర్టీసీ అధికారుల వివరణతో సంతృప్తి చెందని వినియోగదారుల ఫోరమ్, వారి నిర్లక్ష్య వైఖరిపై మండిపడింది. అసలు సౌకర్యాలు కల్పించనపుడు ఆర్టీసీకీ బస్ టికెట్లకు డబ్బులు వసూలు చేసే అర్హత లేదని అసలు కెపాసిటీ కి మించి ప్రయాణికులను ఎందుకు ఎక్కించుకుంటున్నారని ఎదురు ప్రశ్నించింది. వృద్ధుడు నాగేందర్‌ దగ్గర బస్ టికెట్ కి డబ్బులు తీసుకొని అతనికి  సేవలు అందించడంలో వైఫల్యం చెందినందుకుగాను రూ.10,000 జరిమానా చెల్లించాలని ఆర్టీసీని ఆదేశించింది.

(Visited 1,081 times, 1 visits today)