Home / Entertainment / రుద్రమదేవి ని మళ్లీ వాయిదా వేసిన గుణ శేఖర్ ?

రుద్రమదేవి ని మళ్లీ వాయిదా వేసిన గుణ శేఖర్ ?

Author:

భాహుబలి తర్వాత మళ్ళీ అంతటి అంచనాలతో వస్తున్న సినిమా రుద్రమదేవి. అనుష్క రుద్రమ దేవిగా నటిస్తున్న ఈ చిత్రం లో కాకతీయ సామ్రాజ్యానికి  సామంత రాజూ, రుద్రమదేవి కి అత్యంత సన్నిహితుడూ అయిన గోణ గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ అర్జున్ మరో ముఖ్య పాత్రలో దగ్గుబాటి రాణా నటిస్తున్నారు. ఈ సినిమా మీద మొదలైనప్పటి నుంచీ భారీ అంచనాలే ఉన్నాయ్. ట్రైలర్ కి కూడా విశేశ స్పందన లభించింది. తమ అభిమాన తారల్ని యోధులుగా చూసిన ప్రేక్షకులు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఐతే తాజా సమాచారం ప్రకారం రుద్రమదేవి రిలీజ్ డేట్ వాయిదా పడెట్టుగా ఉందట. ప్రతీ ఫ్రేమునీ  జెన్యూన్ గా చూపించాలని తపించే గుణశేఖర్ సినిమాలో  ఏ విశయం లోనూ రాజీ పడకుండా గ్రాఫిక్ వర్క్ దగ్గరుండి మరీ చేయించుకుంటున్నారట. దాంతో రుద్రమ దేవి ఇంకొ రెండు వారలు ఆలస్యంగా విడుదలయ్యే అవకాశాలున్నాయంటున్నారు యూనిట్ సభ్యులు అన్నీ సక్రమంగా జరిగితే మరో చారిత్రక అద్బుతం రుద్రమదేవి సినిమా సెప్టెంబర్ మూడో వారం లో ప్రేక్షకుల ముందుకు రావొచ్చు.

(Visited 74 times, 1 visits today)