Home / Reviews / రుద్రమదేవి సినిమా రివ్యూ.

రుద్రమదేవి సినిమా రివ్యూ.

Rudrama Devi Movie Review

Alajadi Rating

4/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: అనుష్క,అల్లు అర్జున్,రానా,నిత్య మీనన్.

Directed by: గుణశేఖర్

Produced by: గుణశేఖర్

Banner: గుణ టీమ్ వర్క్స్

Music Composed by: ఇళయ రాజా

బాహుబలి ఫీవర్ వీడక ముందే మరోసారి అలాంటి కథ తోనే వస్తున్నాడు గుణశేఖర్, అనుష్క, అల్లు అర్జున్, రాణా ముఖ్య పాత్ర దారులుగా నిర్మించబడిన సినిమా రుద్రమ దేవి. తెలంగాణా చరిత్రలో కాకతీయుల కాలం నాటి కథ తో వస్తున్న ఈ సినిమా బారీ అంచనాలతో విడుదలైంది. మరి కొంత కాలం గా విజయం కోసం చుస్తున్న గుణ శేఖర్ కి ఈ సినిమా ఎలాంటి ఫలితన్నివ్వబోతోంది.ఇప్పటికైతే సినిమా పై ఉన్న అంచనాలు సూపర్ హిట్ ఖాయం అనేలానే ఉన్నాయి… మరి రుద్రమ దేవి గుణశేఖర్ ని ఎలా కరుణిస్తుందో చూడాల్సిందే….

కథ:

చరిత్రని సినిమాగా తీయటం అంటే కత్తిమీద సాము లాంటిదే చరిత్ర ఒక్కోసారి ఒక్కో కథ గా ప్రచారం ఔతుంది ఎన్నో కల్పిత మలుపులు వచ్చి చేరుతాయి. సినిమాలోనూ అలాంటి కల్పితాలు కలిపి తీస్తే అవి బావున్నప్పుడు పరవాలేదు గానీ ఏదైనా తేడా వస్తే మాత్రం విమర్శలనీ, అపకీర్తినీ తట్టుకోవటం కష్టమే జోదా అక్బర్ సినిమా సమయంలో ఇలానే అయింది కానీ లోపాలని నిర్మాణ పర విలువలతోనూ,కొంత లాజిక్ తోనూ
అధిగమించిందా సినిమా. జోధా అక్బర్ లానే చరిత్రలో ఉన్న ఒక ఘటనని ఆధారంగా తీసుకొని కథగా చెప్పే ప్రయత్నం చేశాడు గుణశేఖర్. 13 శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు గణపతి దేవుడు( కృష్ణం రాజు). తన తరువాత సింహాసనాన్ని అధీష్టించడానికి వారసులుగా మగ సంతానం లేకపోవటం తో తన ఏకైక సంతానం అయిన కుమార్తె రుద్రమదేవినే… కుమారుడు రుద్రదేవగా కాకతీయ ప్రజలకు పరిచయం చేస్తాడు. అందుకు తగ్గట్టుగానే మహామంత్రి శివదేవయ్య( ప్రకాష్ రాజ్) రుద్రమదేవిని పురుష భావనతోనే ఉండేలా అన్ని విద్యలలోనూ శిక్షణ ఇస్తాడు. గణపతి దేవుని మరణం తరువాత కొంత కాలనికి కాకతీయ సామ్రాజ్యపు వారసుడు రాజు కాదు రాణి అనీ  రుద్రదేవ కాదు, రుద్రమదేవి (అనుష్క) అని ప్రకటిస్తాడు మంత్రి శివదేవయ్య. ఈ విషయాన్ని సామంత రాజులు వ్యతిరేకిస్తారు. ఓ మహిళా చక్రవర్తి కింద తాము సామంతులుగా ఉండటానికి అంగీకరించరు.  దీంతో రుద్రమదేవి రాజ్యం విడిచి వెళ్లాల్సి వస్తుంది. అదే సమయంలో మహదేవ( విక్రమ్ జిత్) కాకతీయ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని కుట్రలు పన్నుతాడు. పాలన సరిగా లేకపోవటంతో ప్రజా హక్కుల కోసం పోరాడే గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్) కూడా కాకతీయ సామ్రాజ్యంపై ఎదురుతిరుగుతాడు.

ఈ క్రమంలో కూలిపోయేందుకు సిద్దంగా ఉన్న తన రాజ్యంలో నెలకొన్న పరిస్థితులను అధిగమించి ఎలాగైన రాజ్య పరిస్థితి చక్కదిద్దాలని, తానే తిరిగి సింహాసనాన్ని అధిష్టించాలని రుద్రమదేవి ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. అందుకు సాయం చేయాల్సిందిగా తనకు అత్యంత సన్నిహితుడైన నిడదవోలు రాజు చాళుక్య వీరభద్రుడి(రానా) సాయం కోరుతుంది. అలాగే తన భావాలకు తగినట్టు గానే ఆలోచిస్తున్న రాణీ రుద్రమ దేవిని అర్థం చేసుకున్న గోన గన్నారెడ్డి కూడా వీరికి సాయం చేయడానికి అంగీకరిస్తాడు. ఈ ఇద్దరి సాయంతో రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసింది.? యుద్దాన్ని జయించి తాను అఖండ కాకతీయ సామ్రాజ్యానికి చక్రవర్తిని గా ఎలా నిలబడిందీ. ఆ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నది అన్నది తెరమీద చూదాల్సిన కథ.

అలజడి విశ్లేషణ:

మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో కాకతీయ సామ్రాజ్యపు గొప్పతనాన్ని వివరిస్తూ సినిమా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా రుద్రదేవగా,
రుద్రమదేవిగా అనుష్క పాత్రలో ఉండే రెండు షేడ్స్ నీ బ్యాలన్స్ చేయటంలో అత్యంత చాకచక్యంగా డీల్ చేసాడు దర్శకుడు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే ఇంట్రడక్షన్ నుంచి గెటప్, డైలాగ్స్ ఇలా ప్రతీ చిన్న విషయం లోనీ చాలా కేర్ తీసుకున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అద్బుతంగా కనిపించే పాత్ర ఇదే. రుద్రమకు సాయం చేసే సామంత రాజు పాత్రలో చాళుక్య వీరభద్రుడిగా “భల్లాల దేవుడు” రానా మరోసారి మెప్పించాడు యోధుడు గా మెప్పించాడు. బాహుబలిలో మరో చారిత్రక పాత్రలో కనిపించిన రానా తాను ఎలాంటి పాత్రనైన పోషించగలనని మరోసారి ప్రూవ్ చేశాడు. అయితే  అన్ని పాత్రలకు సరైన క్లారిటీ ఇవ్వటంతో మాత్రం దర్శకుడు కొద్దిగా తడబడ్డాడనిపిస్తుంది.ఆడియో పరంగా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది రుద్రమదేవి నిజానికి ఈ సినిమాలో పాటలకి పెద్దగా అవకాశం లేదు దాంతో పాటలు కూడా కావాలని ఇరికించినట్టు గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ వరకు కథ మీద మంచి పట్టు చూపించిన దర్శకుడు తరువాత మాత్రం అనుకున్న స్థాయిలోనడిపించలేకపోయాడు. కథ లో ఉన్న కీలక పాయిట్ ఒక టే కావటం తో పొడిగించినట్టు గా ఉండే సన్నివేశాలు కొద్దిగా అసహనానికి గురిచేస్తాయి.

నటీనటుల ప్రతిభ:

అనుష్క: ఈ చిత్రం మొత్తం అనుష్క ధరించిన రుద్రమ దేవి పాత్ర చుట్టూ తిరుగుతుంది. కాబట్టి  అనుష్క కూడా ఈ పాత్రకోసం చాలా కష్టపడింది. ఆకష్టం అంతా ప్రతీ సన్ని వేశం లోనూ,ఆమె హావభావాలలోనూ కనిపిస్తుంది. కాకతీయ సామ్రాజ్యాధినేత్రిగా యుద్ద విధ్యలభ్యసించి క్రమశిక్షణతో ఉండే యోధురాలిగా ఆమె బాడీ లాంగ్వేజ్ ని అద్బుతంగా పలికించారు. కాని ఈ చిత్రం మొత్తం ఈ పాత్ర చుట్టే తిరిగినా చిత్రంలో ఈ పాత్రకి అంత గొప్పతనం కనిపించలేదు ముఖ్యంగా ఒక డామినేటింగ్ పర్సనాలిటీ గా చరిత్రలో కనిపించిన చక్రవర్తిని పాత్రకి సరయిన ఎలివేషన్ లేదు, ఈ పాత్ర యొక్క దృడత్వం ని సరిగ్గా చూపెట్టలేదు.

అల్లు అర్జున్: అర్జున్ గోన గన్నా రెడ్డి గా పోషించిన పాత్ర ఈ చిత్రానికి హైలెట్ , అయన వేషధారణ,అప్పటి తెలంగాణా ప్రాంత యాస బాగా సెట్ అయ్యింది. ఆయనకి రాసిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి.సినిమా మొత్తం లో గోన గన్నారేడ్డి అనే పాత్ర హైటెన్షన్ తోనే ఉంటుంది.

రానా దగ్గుబాటి: నిజానికి కథ ప్రకారం రానా పాత్ర కి ఎక్కు ప్రాముఖ్యత లేదు కానీ ఉన్నంతలో తన పాత్ర కి పూర్తి న్యాయమే చేసాడు అల్లు అర్జున్ తో పోటీ పడ్డట్టు గా ఆ కొద్ది స్పేస్ లోనే తన ముద్ర వేసాడు. ఈ పాత్ర ని ఎలాగైనా కొద్దిగా పెంచితే సినిమాకి మరో ప్లస్ అయుండేది. కానీ చరిత్ర కదా ఎక్కువ మార్పులు చేసి ఉండక పోవచ్చు.

విక్రంజీత్ నటన పరవాలేదు, కేథరిన్ త్రెస నటనతోనే కాకుండా అందచందాలతో కూడా ఆకట్టుంది. ప్రకాష్ రాజ్ , సుమన్, కృష్ణం రాజు , కృష్ణ భార్గవ్ , హంస నందిని, వెన్నెల కిషోర్, గాయకుదు బాబా సెహగల్, శివాజీ రాజ , ఉత్తేజ్ ఇలా పలువురు నటులు తమ పాత్రలని బాగా చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు:

చరిత్రలో ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవని ఒక గొప్ప అంశాన్ని భారీ చిత్రంగా వెండితెర మీద చూపించాలన్న గుణశేఖర్ తపన ఎట్టకేలకు అద్బుతంగానే
నెరవేరిందని చెప్పొచ్చు. గుణశేఖర్ అంటేనే అద్బుతమైన సెట్టింగులు. తన అభిరుచికి తగ్గట్టు గానే సెట్స్, గ్రాఫిక్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అసలు గ్రాఫిక్స్ విశయం లోనే కొద్ది రోజులు సినిమా విడుదల ఆగిపోయింది. రుద్రమదేవి ప్రేక్షకులను 13వ శతాబ్దంలోకి తీసుకెళుతుంది. పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా తన మ్యూజిక్ మంత్రాన్ని బాగానే పారించి నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారు ఇండియన్ మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా.

ఎడిటింగ్ విషయంలో శ్రీకర్ ప్రసాద్ ఇంకాస్త జాగ్రత్తగా ఉండి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్లో ఇక్కడ వచ్చే సన్నివేశాలు మరీ సాగ దీసినట్టుగా ఉన్నాయి.అయితే ఈ సినిమా కోసం టెక్నికల్ టీమ్ పడిన కష్టం మాత్రం ప్రతీ ఫ్రేములోనూ కనిపిస్తుంది. తోట తరణి ఆర్ట్ వర్క్, జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫి అద్భుతంగా కుదిరాయి. నీతాలుల్లా కాస్ట్యూమ్స్ వల్లా,తోట తరణి ఆర్ట్ వర్క్ వల్లా కాకతీయ సామ్రాజ్యం లో తిరుగుతున్న అనుభూతిని కలిగిస్తాయి.

రుద్రమదేవి సినిమా విషయంలో దర్శకుడి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. దాదాపు 9ఏళ్ల శ్రమించి,కాకతీయ సామ్రాజ్య చరిత్ర మీద రీసెర్చ్ చేసి తయారు చేసుకున్న కథతో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ సినిమాను తెరకెక్కించాడు గుణశేఖర్. కానీ చరిత్ర కావటం తో తెలిసిన కథే కాబట్టి మరింత ఇంట్రస్టింగ్గా చెప్పడంలో కాస్త తడబడ్డాడు. అయితే క్లైమాక్స్లో వచ్చే యుద్ద సన్ని వేశాలతో సినిమాలలోని అన్ని లోపాలనూ ఒకేసారి తుడిచి పెట్టాడు దర్శకుడు. అసలు కథ మీదున్న ఉద్దేశం తోనే వార్ ఎపిసోడ్ మీద ఎక్కువ శ్రద్ద పెట్టి ఉండొచ్చు కూడా.యుద్ధ సన్నివేశాలు ఇంకాసేపు ఉంటే బావుండు అనిపించక మానదు.

ప్లస్ పాయింట్స్ :

  • అనుష్క, అల్లు అర్జున్ ల నటన
  • సెట్టింగ్స్
  • గుణశేఖర్ ప్రయత్నం,కష్టమూ
  • వార్ ఏపిసోడ్

మైనస్ పాయింట్స్ :

  • లెంగ్తీ సీన్స్
  • విజువల్ ఎఫెక్ట్స్
  • ఎడిటింగ్
  • కొద్దిగా విసుగనిపించే పాటలు

సింపుల్ గా చెప్పాలి అంటే ఒక రాజ్య ఆత్మ గౌరవం,ఒక తెలుగు/తెలంగాణా చక్రవర్తిని ధీరోదాత్తతలని తెర పై చూసే అద్బుత అవకాశం.

(Visited 278 times, 1 visits today)