Home / Devotional / చేతి వేళ్ళకు దేవుని ఉంగరాన్ని ఎలా ధరించాలి… ధరిస్తే ఏ పద్ధతులు పాటించాలి.

చేతి వేళ్ళకు దేవుని ఉంగరాన్ని ఎలా ధరించాలి… ధరిస్తే ఏ పద్ధతులు పాటించాలి.

Author:

సాధారణంగా మనలో చాలామంది చేతి వేళ్ళకు పెట్టుకునే ఉంగరాల్లో, మేడలో వేసుకునే చైన్ లలో తమ భక్తి కొద్ది ఇష్టదైవం యొక్క ప్రతిమ ను ఉపయోగిస్తుంటాము. ఉదయం లేచిన వెంటనే కళ్ళకు అద్దుకోవడం, దండం పెట్టుకోవటం లాంటివి చేస్తుంటాము. దేవుడి ప్రతిమ ఉన్న ఉంగారాలు, గొలుసులు ధరించగానే సరిపోదు, వాటిని వాడటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఉంగరాలలో కాని, గొలుసులలో కాని, దేవుడి ప్రతిమలు ఉంటే వాటికి దేవాలయాల్లో తగిన పూజలు, అభిషేకాలు చేయించి జాతకరీత్యా ధరించాల్సి ఉంటుంది. అలా పూజ చేస్తేనే ఆ ప్రతిమలకు శక్తి వస్తుంది. అప్పుడు సాక్షాత్తు భగవంతుడు మన వెంటే ఉన్నట్లు. అయితే ఇక్కడ ఉంగరం ధరించిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలానే ఉన్నాయి.

rules to follow while wearing god rings

ఉంగరంలో ఉన్న దేవుడి ప్రతిమ తల మన మణికట్టు వైపు, దేవుని కాళ్ళు మన గోర్ల వైపు ఉండేలా ధరించాలి. ఎందుకంటే, మన శరీరం చేతివేళ్ళు, గోర్లు భూమిని చూస్తూ ఉంటాయి. ఉంగరాలని కళ్ళకు అద్దుకునేటప్పుడు చేసి గుప్పిట ముడిచి కళ్ళకు అద్దుకోవాలి. ఇక మహిళలు అయితే, బహిష్టు సమయం కంటే ముందే ఉంగరాలను, లాకెట్లను తీసి భద్ర పరుచుకోవాలి. బహిష్టు సమయంలో దేవుడి ప్రతిమలు ఉన్న వాటిని ధరించకూడదు. అంతేకాదు, భోజనం చేసేటప్పుడు ఉంగారానికి ఎంగిలి అంటకూడదు. ఉంగరం ధరించి మాంసాహారం భుజించకూడదు. ఇక ధూమపానం చేసేటప్పుడు, ఆ పొగ మనం ధరించిన దేవుడి ప్రతిమకు తగులకూడదు. అంతేకాదు మద్యపానం కూడా చేయకూడదు. ఇన్ని జాగ్రత్తలు పాటిస్తేనే దేవుడి ప్రతిమ కల ఉంగరాన్ని ధరించాలి. లేకపోతే మనకు మంచి కంటే చెడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంటుందని పెద్దలు చెబుతున్నారు.

Also Read: హిందువులకు అంతమంది దేవుళ్ళు ఎందుకు ఉంటారు! అని ఎగతాళి చేసేవారికి సమాధానం ఇది…

(Visited 7,359 times, 1 visits today)