Home / Latest Alajadi / రష్యా పంపిస్తామని చెప్పినా..అతను మళ్లీ గుడిల ముందు అడుక్కుంటున్నడు.! ఎందుకు వెళ్లట్లేదో తెలుసా.?

రష్యా పంపిస్తామని చెప్పినా..అతను మళ్లీ గుడిల ముందు అడుక్కుంటున్నడు.! ఎందుకు వెళ్లట్లేదో తెలుసా.?

Author:

దేశం కాని దేశం విహారయాత్రకి వెళ్లి ,హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా ఏదన్నా కష్టం వస్తే ఎలా ఉంటుంది.అక్కడ భాష మనకు రాదు,మనుషులు మన వాళ్లు కాదు..డబ్బు కోసం ఏదో ఒకటి చేయాల్సొస్తుంది. కన్నవాళ్లను,ఉన్న ఊరిని,మన దేశాన్ని చూడాలనిపిస్తుంది.ఎప్పుడెళ్తామా,అసలు వెళ్తామా లేదా అనే సంధిగ్దంలో మనసంతా అల్లకల్లోలంగా ఉంటుంది..అలాంటికష్టాన్నే పడుతున్నాడు ఒక యువకుడు ,మన దేశంలో…ఆకలి తీర్చుకోవడం కోసం గుడి మెట్లపైన అడుక్కుంటున్నాడు.అసలు ఆ యువకుడికి వచ్చిన కష్టం ఏంటి,అతనిప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..

రష్యాకు చెందిన 24 ఏళ్ల ఇవాంజెలిన్‌ పర్యాటకుడిగా మన దేశానికి వచ్చాడు. కాంచీపురం గురించి తెలుసుకుని అనేక గుళ్లు తిరిగాడు. సాంకేతిక కారణాల వల్ల అతని ఏటీఎం కార్డు పిన్‌ను రష్యా స్తంభింపజేసింది.అతని చేతిలో ఏమాత్రం డబ్బు లేదు. అతనికి ఆకలి తీరే మార్గం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన ఆకలి తీర్చుకోవడానికి కాంచీపురంలోని కుమారకొట్టం శ్రీసుబ్రహ్మణ్యస్వామి దేవాలయం మెట్లపై కూర్చుని బిచ్చమెత్తుకుంటున్నాడు.భక్తుల ద్వారా విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అతనికి కొంత ధన సహాయం చేశారు. చెన్నైకి వెళ్లి రష్యా రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. అతని డాక్యుమెంట్లు, వీసా, పాస్‌పోర్ట్ అన్నింటిని తాము తనిఖీ చేశామని, అన్నీ సరిగానే ఉన్నాయని చెప్పారు.

ఇదిలా ఉంటే మరోవైపు ఇవాంజెలిన్  విషయంపై  విదేశీవ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పందించారు. ఏటీఎం పిన్‌ పని చేసేలా రష్యా అధికారులతో మాట్లాడతానని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు సుష్మా..ఆ ట్వీట్ సారాంశాం ఏమంటే…

ఇవాంజెలిన్ ..రష్యా మా మిత్ర దేశం, చెన్నైలోని మా అధికారి మీకు సహకరిస్తాడని సుష్మా ట్వీట్ చేశారు.

మీరు రష్యా వెళ్లిపోవచ్చు.. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం.. మీ దేశం వెళ్లటానికి అవసరం అయిన డబ్బులు కూడా ఇస్తాం.. మీ దేశ రాయబారులతో మాట్లాడి మీ బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డు పిన్ నెంబర్ కూడా ఇప్పిస్తాం అని మరీ మరీ భాతరదేశం భరోసా ఇస్తున్నా.. ఇండియా విడిచి వెళ్లను అంటున్నాడు ఈ రష్యా బిచ్చగాడు ఈవ్ జెనీ బేర్టినీ కోవ్. కాంచీపురం పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి చెన్నై రష్యా రాయబార కార్యాలయానికి పంపారు. అలా వెళ్లిన బెర్టినీ కోవ్.. మళ్లీ గుళ్లు, గోపురాల దగ్గర ప్రత్యక్షం కావటం విచిత్రం.

అక్టోబర్ 15వ తేదీ ఆదివారం ఉదయం చెన్నైలోని టీ నగర్ లోని వేంకటేశ్వరస్వామి ఆలయం దగ్గర కోవ్ ప్రత్యక్షం అయ్యాడు. మెట్ల దగ్గర భిక్షమొత్తుతున్నాడు. సాయంత్రానికి ఉస్మాన్ రోడ్డులోని మరో ఆలయం దగ్గర కనిపించాడు. మళ్లీ ఏం కష్టం వచ్చిందో అని.. డబ్బులు ఇస్తాం మీ రష్యా దేశం వెళ్లిపో అంటూ స్థానికులు అంటే.. షాకింగ్ విషయాలు వెల్లడించాడు.

“నాకు రష్యా వెళ్లటం ఇష్టం లేదు.. ఇక్కడ ఆలయాల దగ్గర అడుక్కోవటమే బాగుందని సమాధానం చెప్పాడు. నాతో సెల్ఫీ దిగటానికి పోటీ పడుతున్నారని.. ఒక్కో సెల్పీకి 10 రూపాయలు వసూలు చేస్తున్నట్లు వెల్లడించాడు. అంతేనా.. ఏ గుడి దగ్గర కూర్చున్నా డబ్బులు తెగ వేస్తున్నారని.. ఇండియాలో కేవలం నాలుగు వేల రూపాయలతోనే అడుగు పెట్టానని.. ఇప్పుడు నా దగ్గర 10వేలు ఉన్నాయని చెప్పాడు.నేను శివ భక్తుడిగా మారిపోయానని.. ఆ శివుడే భిక్షమెత్తుకోమని ఆదేశించినట్లు చెప్పుకొచ్చాడు. ఇక నుంచి ఇండియా మొత్తం పర్యటిస్తూ.. ఆలయాల దగ్గర భిక్షాటన చేస్తానని కూడా చెబుతున్నాడు

(Visited 1,697 times, 1 visits today)