కవిత్వం ఎందుకు రాస్తారూ? కవిత్వాన్ని ఎందుకు చదువుతారూ?? రెండూ సమాధానం చెప్పలేని ప్రశ్నలే.. ఒక భాషనీ, భావాన్ని కలపటమనే అల్కెమీ ని సాధన చేస్తూ ఒక పరుసవేదిగా నిలబడే కవి ఒక్కో స్పందననీ సరళీకృత భాషలో చెప్పలేక కాదు గానీ,చెప్పే విశయానికి ఒక ప్రత్యేక స్వరాన్ని కోరుకుంటాడు.భాషలోని శబ్దాలని స్వరాలుగా చెక్కేప్రయత్నం చేస్తాడు. పదాలలో ఒక రిథం ఉన్నప్పుడు అవి వినేవారినీ చదివేవారినీ ఆకర్శిస్తాయి,కవిత్వంలోని మార్మికత కవి చెప్పే అంశాన్ని కూడా అధిగమించి ఆలోచించే లా పాఠకున్నీ,శ్రోతనీ ఇన్స్పైర్ చేస్తుంది.
బహుశా తన ఆలోచనా స్థాయిని మరింత ఉన్నత స్థానానికి చేర్చే పనిలో భాగం గానే కవి కవిత్వాన్ని రాస్తాడేమొ..! తనతో పాటే పాఠకున్నీ కవిత్వ అంతర్లీనాలోచనా ప్రవాహంలో కి లాక్కు పోతాడు. ఈ శీర్శిక లో కొందరు కవులతో కలిసి కవిత్వాన్ని మనలోకి వొంపుకునే ప్రయత్నం, వొక భావక్షర రసవాద ప్రయోగం చేయ బోతున్నాం. కవుల పరిచయాలూ,పుస్తక,కవిత్వ విశ్లేషణల తో పాటు ప్రతీ రోజూ ఒక కవిత.
ఇక్కడ మీ మనసుని తడిమేందుకు, వెన్నెల వెనుక చల్లదనమూ ఉండొచ్చు ఆ చంద్రున్ని వెలిగించే సూర్యుని జ్వలనావేశమూ ఉండొచ్చు. రెంటినీ కలిపి అందం గా చూపే కవీ ఉండొచ్చు వచ్చేయంది కవిత్వం లో ఒక మునక వేద్దాం….