Home / Uncategorized / “నా పేరు శివ. నేను చేసిన పనే మీరు చేస్తే తిప్పలు తప్పవు” అంటూ ఒకరు పంపిన మెసేజ్ ఇది!

“నా పేరు శివ. నేను చేసిన పనే మీరు చేస్తే తిప్పలు తప్పవు” అంటూ ఒకరు పంపిన మెసేజ్ ఇది!

Author:

నా పేరు శివ, నేను అందరి లాగానే పొద్దున్న అలారమ్ మొగగానే లేచి, మళ్ళీ పడుకొని, తరువాత కొంత సేపటికి లేచి బ్రష్ చేసుకొని బ్రెడ్ ఓహ్ ఇడ్లీ ఓహ్ తిని ఆఫీస్ కి తొందరగా వెళ్లాలనే టెన్షన్ లో బండి మీద ఫాస్ట్ గా వెళ్తా, దారి పొడవునా 10 కి పైనే రెడ్ సిగ్నల్స్, చివరికి ఆఫీస్ కి ఒక అరగంట లేటు గా వెళ్తా, ఎవరూ గమనించకుండా ఉండాలని చాలా నెమ్మదిగా నా క్యాబిన్ కి వెళ్లి నా వర్క్ స్టార్ట్ చేస్తా.

ఇక కొంచెం సేపు నా పని చేయగానే సోషల్ మీడియా ఓపెన్ చేస్తా, ఓపెన్ చేసిన కొంత సేపటికే లంచ్ టైం అవతాది. లంచ్ చేసాక ఫాస్ట్ ఫాస్ట్ గా వర్క్ ఫినిష్ చేసి సాయంత్రం 6 వరకు టైం పాస్ చేస్తూ ఉంటా, 6 కాగానే బండేసుకొని మళ్ళీ ఇంటికి జంపు, కాళ్లు చేతులు కడుక్కొని మంచమెక్కి యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ అంటూ రాత్రి 1,2 వరకు పడుకోను, పడుకొనే ముందు ఏదో ఒకటి తినేసి పడుకుంటా. మళ్ళీ రోజు ఇదే తతంగం, ప్రతి రోజు ఇలాగే ఉంటుంది, సెలవు రోజుల్లో ఊర్లకు వెళ్లడం, ఎంజాయ్ చెయ్యడం, తిరిగి ఆఫీస్ కి వచ్చి అదే వర్క్ ని అదే తరహా లో చెయ్యడం. నా లాగా 10 లో 7 మంది ప్రతి రోజు దినచర్య ఇదే, ఆ మిగిలిన ముగ్గురు మన ఆఫీస్ లో బాస్ లు కోటీశ్వరులు అయి ఉంటారు అని అనుకుంటే పొరపాటే.

ఎందుకంటే వాళ్ళు మనలాగే మన దినచర్యను పాటిస్తారు, కానీ వారు అలారమ్ మొగకముందే లేస్తారు, వ్యాయామాలు చేస్తారు, ఆఫీస్ లో వాళ్ళ వర్క్ తొందరగా అయిపోగొట్టి తరువాత చెయ్యాల్సిన వర్క్ ని కూడా ముందే అయిపోగోడతారు. ఆ తరువాత వేరే వర్క్ ని నేర్చుకోడానికి ఆ సమయాన్ని కేటాయిస్తారు. సాయంకాలం మన లాగే సోషల్ మీడియా వాడతారు, కానీ కోర్స్ అవి ఇవి అంటూ దానితో పాటె ఇది కానిస్తారు. అందుకే వాళ్ళు అన్ని విషయాల్లో మనకంటే ముందు ఉంటారు. మనము కూడా ఆ ముగ్గురిలో ఒకరిగా ఉండాలి అనుకోవాలి, నేను ఆ 7 మందిలో ఒకడిని. కానీ ఇప్పుడు ఆ ముగ్గురిలో ఒకడిగా అవ్వాలని ప్రయత్నిస్తున్నా. మీరు కూడా నా మాదిరిగా 7 మందిలో ఒకరి గా ఉన్నట్టు అయితే, మిగిలిన ముగ్గురిలో ఒకరి గా నిలవడానికి ప్రయత్నించండి.

(Visited 1 times, 1 visits today)