Home / Entertainment / తిక్క టీజర్ విడుదల..!

తిక్క టీజర్ విడుదల..!

Author:

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం సినిమాలు హిట్టు కావడంతో మన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చాలా ఊపు మీద ఉన్నాడు, మిగతా హీరోల లాగ ఏడాదికో సినిమా కాకుండా వెంట వెంటనే సినిమాలు చేస్తున్నాడు, ఇప్పుడు “తిక్క” పేరుతో ఒక సినిమాని రెడీ చేసాడు, ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఈరోజు తిక్క టీజర్ కూడా విడుదల చేశారు.

జగమే మాయ.. బతుకే మాయ అంటూ టీజర్ స్టార్ట్ చేశాడు దర్శకుడు సునీల్ రెడ్డి, టీజర్ ని చూస్తుంటే ఒక కొత్త రకం యూత్ ఫుల్ స్టోరీతో వస్తున్నట్టుగా అనిపించింది, తాగుబోతు రమేష్ అమ్మాయిల గురుంచి చెప్పిన డైలాగ్ బాగా పేలింది, ఈ సినిమాలో లారిస్సా బొనెస్సి, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు, జూలై 30న ఆడియో విడుదల చేస్తారు. ఆగస్టు 13న సినిమా ప్రేక్షకుల ముందుకువస్తుంది.

(Visited 523 times, 1 visits today)